నల్లగొండ జిల్లా చండూరు మండలం ప్రాథమికోన్నత పాఠశాల తేరట్పల్లి ఉపాధ్యాయులు బుదవారం వినూత్నంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు.మైక్ లో భీమ్లా నాయక్ పేరడీ సాంగ్ “అడుగు పెట్టు… గణ గణ గణ మనీ గంట మోగే… చక చక మని కాళ్లు కదిలే.లాలా! గల గల గల బడికి రారా! ” పెట్టి ఉత్సాహంగా అందర్నీ ఉత్సాహపరుస్తూ… బడిబాట కార్యక్రమం ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మైక్ లో వినూత్నంగా బడిబాట ప్రచారం నిర్వహించిన ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ నాయక్ ను ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య బోధన ఉంటుందని ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.
ఉపాధ్యాయుడు,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ… “ప్రైవేట్ పాఠశాల వద్దు -ప్రభుత్వ పాఠశాల ముద్దు” అనే నినాదంతో ప్రజలు తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనీ అన్నారు.
అలాగే లలిత జ్యువెలరీ ప్రకటనలో కిరణ్ చెప్పినట్లు “బడిని కంప్యార్ చేసేటప్పుడు ప్రభుత్వ బడి బాగుంటుందా? ప్రైవేట్ బడి బాగుంటుందా? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు పాఠశాలలను ఎంపిక చేసుకునేటప్పుడు రెండు,మూడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువులను పరిశీలించండి.
అప్పుడు చదువు నాణ్యత దేంట్లో ఉందో తెలుస్తుంది, డబ్బులు ఈజీగా రావు” అని మీ పిల్లల చదువుకు గ్యారెంటీ మేము ఇస్తామని అన్నారు.
ఉపాధ్యాయులు చేస్తున్న ఈ ప్రయత్నానికి పలువురు అభినందిస్తున్నారు.ఈ బడిబాట ప్రచార కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోనవెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి శివ, గ్రామ పంచాయతీ సిబ్బంది యాదయ్య తదితరులు పాల్గొన్నారు.