ఆ హీరోల తర్వాత ఆ క్రెడిట్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటించే స్థాయికి ఎదిగారు.ప్రస్తుతం ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Vijay-devarakonda Participates In Koffee With Karan After Prabhas And Rana Detai-TeluguStop.com

ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీ విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి టాక్ షో కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది.

ఇప్పటి వరకు బుల్లితెర పై ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.ఇక ఈ టాక్ షోలో భాగంగా కాఫీ కప్‌పై విజయ్‌ దేవకొండ, కాఫీ విత్‌ కరణ్‌ సైన్‌ పెట్టిన రెండు కప్పులతో కూడిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Telugu Ananya Panday, Anushka, Heroes, Karan Johar, Koffee Karan, Liger, Prabhas

ఇక ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా హాజరయ్యారు.ఇకపోతే ఇదివరకే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా బాహుబలి చిత్ర బృందం హాజరయ్యారు.బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పాటు ప్రభాస్, రానా, అనుష్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక ప్రభాస్ రానా తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ ఆ క్రెడిట్ సొంతం చేసుకున్నారు.

బాహుబలి సినిమాని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube