హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానని భయపడ్డ.. విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.తన యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Fear Of Dying Without Becoming A Heroine Vishnu Priya Comments Viral Details, V-TeluguStop.com

తొలిసారిగా పోవే పోరా షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది.అందులో తన మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.

కానీ అవకాశాలు మాత్రం ఎందుకో అందుకోలేకపోతుంది.ప్రస్తుతం అవకాశాల కోసం బాగా పోరాట పడుతుంది.కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.

కాని విష్ణు ప్రియ అక్కడ కూడా ఎదగలేకపోతుంది.అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియాలో బాగా బిజీగా మారింది.

నిత్యం తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.

పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.

Telugu Anchorvishnu, Deepika Pilli, Raghavendra Rao, Tollywood, Vishnu Priya, Pa

నిజానికి విష్ణుప్రియాలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించాలి అని ఇంతా కాలం ప్రయత్నించింది.దీంతో మొత్తానికి ఈ ముద్దుగుమ్మకు వెండి తెరపై ఓ సినిమాలో అవకాశం వచ్చింది.

ప్రస్తుతం ఆమె శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

Telugu Anchorvishnu, Deepika Pilli, Raghavendra Rao, Tollywood, Vishnu Priya, Pa

ఇక ఇందులో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటిస్తున్నారు.దర్శకుడు, కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఓవైపు ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నారు ఈ సిని బృందం.అలా ప్రమోషన్స్ భాగంలో విష్ణు ప్రియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలను పంచుకుంది.

Telugu Anchorvishnu, Deepika Pilli, Raghavendra Rao, Tollywood, Vishnu Priya, Pa

తాను హీరోయిన్ కాకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను అంటూ.దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు గారు ఈ వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో తనకు మంచి అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చింది.ఇక ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇక తొలిసారిగా వెండితెరపై ఈ సినిమాతో కనిపించనున్న విష్ణు ప్రియ ఎలాంటి పాత్రలతో మెప్పిస్తుందో.ఇంతకూ తన పాత్ర ఏంటో ఈ సినిమా విడుదల వరకు ఎదురుచూడక తప్పదు.

ఒకవేళ ఈ సినిమాతో విష్ణు ప్రియ మంచి సక్సెస్ అందుకుంటే మాత్రం తర్వాత తనకు అవకాశాలు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube