దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఖుషి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది.ఇకపోతే తాజాగా కాశ్మీర్ లో సమంత, విజయ్ దేవరకొండ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ క్రమంలోనే సమంత, విజయ్ దేవరకొండ కు గాయాలు అయ్యాయని,దీంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత, విజయ్ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్లు సమాచారం.షూటింగ్ చేస్తుండగా వీరిద్దరు లిడర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట.
ఆ సన్నివేశాన్ని చేస్తున్న సమయంలో నీటిలో పడడంతో వారిద్దరికీ గాయాలైనట్లు సమాచారం.ఇక వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ వారిద్దరికి చికిత్సను అందించారని వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన శివ నిర్వాణ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కొట్టి పడేశాడు.
ఇకపోతే ఖుషి సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకు అనుగుణంగానే సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.కాగా ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్‌తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా సమంతా కాశ్మీర్ అందాలను అక్కడి ప్రజల జీవన శైలికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.