చరణ్ సినిమా చరణ్ కే పోటీ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.

 Ram Charan Two Movies Release Same Date Details, Acharya, Alia Bhatt, Charan, Ko-TeluguStop.com

ఆర్, ఆచార్య రెండు సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి.ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమా లో రామరాజు పాత్రలో అదరగొట్టగా.ఆచార్యలో సిద్ధ పాత్రలో ఆకట్టుకున్నారు.

అయితే ఈ రెండు సినిమాల థియేట్రికల్ రిజల్ట్ తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్ అనుకున్నట్టుగానే మరోసారి రాజమౌళి స్టామినా చూపించగా ఆచార్య మాత్రం కొరటాల శివ ఖాతాలో మొదటి ఫెయిల్యూర్ ని మిగిల్చింది.

అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు డిజిటల్ రిలీజ్ అవడం విశేషం.చరణ్ నటించిన రెండు లేటెస్ట్ సినిమాలు ఒకేరోజు ఓటీటీ రిలీజై తన సినిమాలు తనకే పోటీ వచ్చేలా చేస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా అగ్రిమెంట్ ప్రకారం 50 రోజుల తర్వాత జీ 5 ఓటీటీలో మే 20న రిలీజ్ చేస్తున్నారు.ఇక అదేరోజున ఆచార్య అమేజాన్ ప్రైం లో వస్తుంది.

అఫ్కోర్స్ ఆచార్య వచ్చినా ఎక్కువమంది ఆర్.ఆర్.ఆర్ ని చూడటానికే ఇష్టపడతారు.కానీ చరణ్ నటించిన 2 మూవీస్ ఒకేరోజు డిజిటల్ రిలీజ్ అవడం అనేది మాత్రం మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే విషయమే.

డిజిటల్ రిలీజ్ అయినా ఆచార్య ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube