మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య.ఈ సినిమా 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.ఇకపోతే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆచార్య చిత్ర బృందంతో చిట్ చాట్ చేశారు.
ఈ క్రమంలోనే హరీష్ శంకర్ కొరటాల శివ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.
ఇక హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరిద్దరు(చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా బాగా డాన్స్ చేసే హీరోలు ఎవరు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెబుతూ…టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా డాన్స్ చేసే వారు చాలా మంది ఉన్నారు.అలాంటి వారిలో తారక్, బన్నీ, రామ్, నితిన్ చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారని మెగాస్టార్ తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా బెస్ట్ డాన్సర్స్ గురించి సమాధానం చెప్పగా వెంటనే రామ్ చరణ్ కల్పించుకుని తన దృష్టిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్, బన్నీ వాళ్ళిద్దరూ బెస్ట్ డాన్సర్స్ అంటూ రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.