సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏ సెలబ్రిటీ అయినా కూడా ఎక్కువకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగి మంచి గుర్తింపు సంపాదించుకోవాలని తాపత్రయపడతారు.ఇలా ప్రాంతీయ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత ఇతర భాషలలోకి కూడా ప్రవేశిస్తూ అక్కడ తనకంటూ గుర్తింపు రావాలని ఎంతోమంది కృషి చేస్తూ ఉంటారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా, డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అని చెప్పాలి.
కొరటాల శివ కెరియర్ మొదట్లో రచయితగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈయన సింహ సినిమాకి కథ అందించారు.ఇలా రచయితగా పలు చిత్రాలకు కథ అందించిన కొరటాల మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.
మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు.ఈ విధంగా కొరటాల ఇండస్ట్రీ లోకి రాక ముందే తన రిటైర్మెంట్ ప్రకటించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఈయన రచయితగా ఉన్నప్పుడు 10 అద్భుతమైన కథలను రాసుకున్నారు.ఈ క్రమంలోనే ఆ పది సినిమాలకు దర్శకత్వం వహించిన అనంతరం దర్శకుడిగా తాను రిటైర్మెంట్ తీసుకుంటానని గతంలో ప్రకటించారు.దర్శకుడిగా రిటైర్మెంట్ అయిన తర్వాత చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తానని గతంలో కొరటాల వెల్లడించారు.
ఇలా ఇండస్ట్రీలోకి ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించుకొని వచ్చిన ఈయన నిజంగానే పది సినిమాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా… లేదంటే రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.