ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి అందరికి తెలిసిందే.ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి టాప్ మోస్ట్ హీరోయిన్ లలో చేరుతోంది.
ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఒకసారి నాలుగు ఆఫర్లను దక్కించుకుంది.అయితే వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నా తొందర పడకుండా ఆలోచిస్తూ కేవలం తనకు నచ్చిన సినిమాలను చేయడానికి మాత్రమే ఒప్పుకుంటుంది.
ఇకపోతే ఈ మధ్య వరుసగా ఆఫర్లు వస్తూ ఉండటంతో కృతి శెట్టి కొన్ని సినిమా ఆఫర్లను తిరస్కరిస్తోందట.ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన కొత్త సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే కృతి శెట్టి తిరస్కరించిన ఆ ఆఫర్ ను టాలీవుడ్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ ఓకే చెప్పిందట.ఇటీవల ఒక సినిమాలో తల్లి పాత్రలో నటించడానికి కృతి శెట్టి భయపడిందట.
ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గానే కాకుండా చిన్న పాపకు తల్లి పాత్రలో కనిపించాలని చెప్పి అనంతరం దర్శకుడు కథను వివరించాడట.అయితే దర్శకుడు కథ చెప్పిన తర్వాత కొంత ఆలోచించి లిఫ్ట్ చేయలేదని ఆ ప్రాజెక్టు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ ప్రాజెక్టు మరేదో కాదు దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం లో శర్వానంద్ హీరోగా చేయబోతున్న కొత్త సినిమా.సినిమాలో ఒక చిన్న పాపకు తల్లి గా కనిపించే కారెక్టర్ ఉంటుందట.
సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ కెరిర్ బాగా ఉన్న సమయంలో, మొదట్లో తల్లిగా కనిపించి రిస్క్ చేయలేనని అందువల్లే ఆ ప్రాజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం దర్శకుడు ఆ కథను మహానటి కీర్తి సురేష్ కు వినిపించగానే, అందుకు కీర్తి సురేష్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.ఇకపోతే కృతి శెట్టి విషయానికి వస్తే ఇటీవల బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో కృతి శెట్టి కూడా ఒక్కసారిగా పారితోషికాన్ని పెంచేసింది.ఇదే కాకుండా బంగార్రాజు సినిమాలో నటించడం కోసం కృతి శెట్టి ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.