ఐపీఎల్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ ఒక అరుదైన రికార్డు నమోదు నెలకొల్పాడు.అంతేకాదు 2022 సీజన్‌లో ఫస్ట్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా కూడా బట్లర్ రికార్డ్ సృష్టించాడు.
శనివారం రోజు ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేశాడు.బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్ తో రాజస్తాన్ రాయల్స్ ముంబై జట్టుపై సునాయాసంగా గెలిచింది.
ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఆడిన బట్లర్ 11 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.ముంబై ప్లేయర్ బాసిల్ థంపి బౌల్ చేసిన 4వ ఓవర్‌లో బట్లర్ బ్యాట్ తో రెచ్చిపోయాడు.
ఈ ఓవర్ లో అతను ఏకంగా 26 రన్స్ చేశాడు.దీంతో కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించగలిగాడు.
ఈ సెంచరీతో వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో సెంచరీ చేసిన రెండో ఇంగ్లాండ్ క్రికెటర్ గా జాస్ బట్లర్ ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.2021 ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 64 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు బట్లర్.మళ్లీ ఇప్పుడు సెంచరీ సాధించి అతడు వరుసగా 2 సెంచరీలు సాధించిన ఇంగ్లాండ్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇంతకుముందు ఇంగ్లీష్ ప్లేయర్ బెన్ స్టోక్స్ వరుసగా రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో శతకం చేశాడు.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఉగాది రోజున జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లో బట్లర్ బాగా ఆడటంతో రాజస్థాన్ జట్టు డీసెంట్ స్కోర్ చేయగలిగింది.
ఈ స్కోరును చేజ్ చేయలేక ముంబై జట్టు చతికిల పడింది.వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో బట్లర్ తప్ప మిగతా వారు ఎవరూ సరిగా రాణించలేదు.అందరూ తక్కువ పరుగులకే వరుసగా అవుటయ్యారు.
ఈ సమయంలోనే టీమ్ కు కొండంత అండగా మారాడు బట్లర్.బట్లర్ రన్స్ తో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేయగలిగింది.దీంతో ఓటమిపాలైంది.