రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు మేలు జరిగే విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం మంత్రి కొడాలి నాని

కాకినాడ పోర్టు నుండి విదేశాలకు 25 రూపాయలకే బియ్యం ఎగుమతి చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాకినాడ పోర్టు నుండి ఎగుమతి జరిగేది ఏపీ బియ్యం ఒక్కటే కాదు.

 Kodali Nani Comments On Raitu Bharosa Program, Raitu Bharosa, Kakinada , Kodali-TeluguStop.com

చెన్నై, ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల బియ్యం చాలా ఏళ్లుగా కాకినాడ నుండి ఎగుమతి జరుగుతుంది.రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు మేలు జరిగే విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

ప్రజలకి పుచ్చిపోయిన బియ్యం పంపిణీ చేస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు.ఈ ఖరీఫ్ సీజన్ లో 45 లక్షల మెట్రిక్ టన్నుల వస్తుదని అంచనా ఉంది.

ఇప్పటి వరకు 34 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది.మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తాం.6 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే.3 వేల కోట్లు చెల్లింపులు జరిగాయి.21 రోజులు లోపే రైతులకు చెల్లింపులు జరిగి పోతున్నాయి.విజయవాడలో చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క ఫ్లై ఓవర్ పూర్తి చేయలేకపోయాడు.

మా ప్రభుత్వం వచ్చాక మూడు ఫ్లై ఓవర్లు పూర్తి చేసి ప్రారంభించాం.బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లై ఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేసాం.

ఈ మూడేళ్ళలో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల నిర్మాణాలు చేసాం.ఇంకో 10 వేల కోట్లు శంకుస్థాపన చేశారు.

పంచాయతీ సర్పంచ్ లను పిలిచి పనికిమాలిన సొల్లు చెప్తున్నాడు.చంద్రబాబు ఎంత మంది అధికారులను మార్చాడు.

గుర్తు లేదా.

ఈయనకి భయపడి సవాంగ్ కి పోస్టింగ్ ఇచ్చారని సిగ్గులేకుండా చెప్తున్నాడు.

ఛార్జ్ షీట్ అనేది మొత్తం బయటకి రావాలి కదా.కొన్ని అంశాలే రావడం ఏంటి.వివేకా ని హత్య చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది.వివేకా ని హత్య చేస్తే జగన్ కి పదవులు వస్తాయా.డబ్బులు వస్తాయాదేవుడు, ప్రజల్ని నమ్ముకున్న కుటుంబం జగన్ ది.జగన్ కుటుంబ సభ్యుల్ని పెంపుడు కుక్కలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాడు.మేము అనకపోయినా అన్నట్టు ఎక్కి ఎక్కి ఏడ్చాడు.లోకేష్ కి కార్టూన్ లు చూడటం అలవాటు.అందుకే అవి విడుదల చేసారు .టీడీపీ చివరికి కార్టూన్ పార్టీగా మిగిలిపోతుంది.

Kodali Nani Comments On Raitu Bharosa Program, Raitu Bharosa, Kakinada , Kodali Nani , Ys Jagan , Ycp , Ap Poltics, Tdp , Chandra Babu , Nara Lokesh - Telugu Ap Poltics, Chandra Babu, Kodali Nani, Lokesh, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube