ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ ప్లాట్‌ఫామ్ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి.అప్పట్లో రైలు టికెట్స్ కావాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్లి గంటల తరబడి లైన్లో నుంచుని టికెట్లు కొనుక్కునేవాళ్ళం.
కానీ ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఎంచక్కా ఇంట్లో కూర్చొనే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం లభించింది.
కేవలం రైలు టికెట్లు మాత్రమే కాకుండా బస్ టికెట్లు, హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీల బుకింగ్, ఫ్లైట్ టికెట్లు ఇలా అనేక సేవల్ని ఫోన్లో బుక్ చేసుకునే సదుపాయం అందిస్తోంది ఐఆర్‌సీటీసీ.
ఈ క్రమంలోనే రకరకాల వెబ్‌సైట్స్, యాప్స్ ప్రారంభించారు.
అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే కన్వేయెన్స్ ఫీజ్ కింద కేవలం 50 రూపాయిలు మాత్రమే ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారికి రూ.50 లక్షల విలువైన ఎయిర్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డుతో బుక్ చేస్తే 5 శాతం వ్యాల్యూ బ్యాక్ లభిస్తుందట.
అయితే కస్టమర్లు ఏ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్స్ బుక్ చేసినా కన్వేయెన్స్ ఫీజు తప్పక చెల్లించాల్సిందే.
![Telugu Laks Ruppess, Insurance, Irctc, Latest-Latest News - Telugu Telugu Laks Ruppess, Insurance, Irctc, Latest-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/01/50laks-ruppessInsuranceirctc-latest-news-50laks-ruppess.jpg )
ఈ ఫీజు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో వేర్వేరుగా ఉంటుంది.కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రూ.150 ఉంటే మరికొన్ని వాటికి 50 రూపాయలుగా కన్వేయెన్స్ ఫీజు చెల్లించాలి.గతంలో రైలు టికెట్ బుకింగ్ పైనా ఐఆర్‌సీటీసీ కన్వేయెన్స్ ఫీజు ఛార్జ్ చేసింది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను భారతీయ రైల్వే కన్వేయెన్స్ ఫీజును తొలగించింది.
దీంతో అప్పటి నుంచి ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ల బుకింగ్‌పై కన్వేయెన్స్ ఫీజు వసూలు చేయకపోవడం గమనార్హం.