టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్‍కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుందా? అని అడిగితే అవుననే అంటున్నారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు.మరికొన్ని రోజుల్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.
అయితే ఆ దేశంలో ఆడే మ్యాచ్‌లతో సీనియర్ క్రికెటర్ల భవితవ్యం తేలనుందని స్పష్టమవుతుంది.ఎందుకంటే సౌతాఫ్రికా పర్యటనలో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సీనియర్ ఆటగాళ్లు అందరినీ శాశ్వతంగా పక్కనపెట్టేసి.
యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి అజింక్య రహానె, ఛతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మలపై కత్తులు వేలాడుతున్నాయి.
వీరు తమ సత్తా చూపకపోతే వారికి దక్షిణాఫ్రికా సిరీసే ఆఖరిది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ.ఇప్పటికే బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వార్నింగ్ ఇస్తూనే దక్షిణాఫ్రికా సిరీస్ కు వీరిని ఎంపిక చేసింది.అయితే తుది జట్టులో ఇషాంత్ శర్మ ఉన్నట్లయితే తోటి యువ పేసర్ల కంటే మెరుగైన ప్రదర్శన చూపించాల్సి ఉంటుంది.
ఒకవేళ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో లాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా విఫలమైతే అతని కెరీర్ ముగిసినట్టేనని చెప్పవచ్చు.
టీమిండియాలో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ తమ స్థానాలను బలపరచుకున్నారు.

వారు కాకుండా శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ వంటి కుర్రాళ్లు తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు.ఇలాంటి పరిస్థితులలో సరిగా బౌలింగ్ చేయకపోతే ఇషాంత్ శర్మ తదుపరి మ్యాచ్ లలో స్థానం కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ.దక్షిణాఫ్రికా తర్వాత శ్రీలంక భారతదేశంలో టీమిండియాతో సిరీస్ ఆడుతుంది.ఈ సిరీస్‌లో టీమిండియా జట్టులో ఎంపిక కావడం అనేది దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిచిన ఆట తీరుపై ఆధారపడి ఉంటుంది.గతేడాదిగా ఇషాంత్ చాలా పేలవంగా ఆట ఆడుతున్నాడు.8 టెస్టుల్లో కేవలం 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.దీనికితోడు గాయాలు, పాటు ఫిట్నెస్ వంటి కారణాలు అతడికి శాపంగా మారుతున్నాయి.ఇప్పటికే వందకు పైగా ఆడినట్టు ఇషాంత్ మొత్తంగా 311 వికెట్లు పడగొట్టాడు.