వయసు పైబడే కొద్దీ వృద్ధాప్య ఛాయలు వేధించడం సర్వ సాధారణం.కానీ, ఇటీవల రోజుల్లో చిన్న వయసు వారు సైతం వృద్ధాప్య లక్షణాలను ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే వాటిని నివారించుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల యాంటీ ఏజింగ్ క్రీములను, నూనెలను కొనుగోలు చేసి యూజ్ చేస్తున్నారు.వాటి వల్ల ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను వాడితే గనుక.చాలా సులభంగా వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ యాంటీ ఏజింగ్ క్రీమ్ ఏంటీ.? దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.?మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల షియా బటర్, రెండు స్పూన్ల బాదం నూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ తేనెటీగ మైనం, మూడు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్, రెండు చుక్కలు క్యారెట్ సీడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఐదు నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార బెట్టుకుని గాజు సీసాలో నింపుకుంటే యాంటీ ఏజింగ్ క్రీమ్ సిద్ధమైనట్టే.ఇక ఈ క్రీమ్‌ను ఎలా వాడాలంటే.రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని తొలగించి వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇప్పుడు యాంటీ ఏజింగ్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి బాగా ఆరిన తర్వాత నిద్రించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక వృద్ధాప్య లక్షణాలన్నీ పరార్ అవుతాయి.అదే సమయంలో ముఖ చర్మం తేమగా, మృదువుగా మెరిసి పోతుంది.