తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించి యమున పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో టీవీ సీరియళ్లలో నటిస్తూ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.యమున అసలు పేరు ప్రేమ కాగా ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కె.
బాలచందర్ ఈమె పేరును మార్చారు.కన్నడ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన యమున తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు.
యమున 50కు పైగా సినిమాలలో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.వివాహం తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న యమున సీరియళ్లతో రీఎంట్రీ ఇచ్చారు.
ఒక వివాదాస్పద కేసులో అరెస్ట్ కావడం ద్వారా కొన్నేళ్ల క్రితం యమున వార్తల్లో నిలిచారు.అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని యమున క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

బాలచందర్ గారి సినిమాలో నటించిన తర్వాత సరైన ఆఫర్లు రాలేదని తాను పొట్టిగా ఉండటంతో చిన్న పాత్రలు ఆఫర్ చేశారని అయితే ఆ పాత్రలను రిజెక్ట్ చేశానని యమున తెలిపారు.ఆ తర్వాత మౌన పోరాటం సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని ఆ సినిమాలో తాను బ్లౌజ్ లేకుండా నటించానని యమున తెలిపారు.

కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఆ ఫీలింగ్ ను ఎక్స్ ప్రెస్ చేస్తానని ఆ రీజన్ వల్లే తనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని యమున చెప్పారు.ఎవరెవరో తన భర్త అంటూ పోస్టులు పెట్టవద్దని తనను అడిగితే ఫ్యామిలీ ఫోటోలను పంపిస్తానని యమున పేర్కొన్నారు.తన భర్త పేరు జయంత్ కుమార్ అని ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని యమున వెల్లడించారు.