మన దేశంలో కరెన్సీ నోట్లపై మన జాతిపిత అయినా మోహన్ దాస్ కరం చంద్ గాంధీ బొమ్మ ఉంటుంది అనే విషయం తెలిసిందే.మన కరెన్సీ మీద గాంధీజి బొమ్మ లేకపోతే దానికి విలువ ఉండదు.
ఎవ్వరైనా గాంధీజీ బొమ్మ ఉంటేనే దానిని తీసుకుంటారు.కనిపించే గాంధీజీ బొమ్మ మాత్రమే కాదు కనిపించని గాంధీ బొమ్మ కూడా మన కరెన్సీ నోటు మీద చూసే ఉంటాం.
గాంధీ బొమ్మ లేకపోతే అది దొంగనోటుగా పరిగణిస్తారు.అయితే దేశంలో స్వాతంత్య్రం రాకముందే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి.కానీ స్వాతంత్ర్యం రాకముందు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఉండేది కాదు.అప్పట్లో కరెన్సీ నోట్ల మీద కింగ్ జార్జ్ బొమ్మ ఉండేదట.
అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియా 1949 లో ఇండియా రూపాయి నోటు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
అప్పుడు ఇండియా ఆ రూపాయి నోటు మీద కింగ్ జార్జ్ బదులు మహాత్మా గాంధీ ఫోటోను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించిందట.
కానీ దీనిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో గాంధీజీ బొమ్మకు బదులుగా అశోక స్థంభం బొమ్మను ముద్రించారట.ఇక ఆ తర్వాత గాంధీజీ శత జయంతి సందర్భంగా 1969లో కరెన్సీ నోటు మీద తొలిసారి గాంధీ బొమ్మను ముద్రించారు.
![Telugu Currency, Gandhiji, Gandhipicture, India, George, Mahatma Gandhi, Mayanma Telugu Currency, Gandhiji, Gandhipicture, India, George, Mahatma Gandhi, Mayanma](https://telugustop.com/wp-content/uploads/2021/10/gandhi-ji-photo-on-indian-currency-detailss.jpg )
1987లో మన దేశంలో 500 రూపాయల నోటు అందుబాటులోకి వచ్చింది.దానిపై కూడా గాంధీ బొమ్మను ముద్రించారు.ఇక అప్పటి నుండి ఆర్బీఐ ఏ కొత్త నోటును ముద్రించిన ఆ నోటు మీద గాంధీ బొమ్మను ముద్రించడం మొదలు పెట్టాడు.అయితే మన కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా.
దీని గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.
![Telugu Currency, Gandhiji, Gandhipicture, India, George, Mahatma Gandhi, Mayanma Telugu Currency, Gandhiji, Gandhipicture, India, George, Mahatma Gandhi, Mayanma](https://telugustop.com/wp-content/uploads/2021/10/gandhi-ji-photo-on-indian-currency-detailsa.jpg )
మన కరెన్సీ నోటు మీద ముద్రించే గాంధీ బొమ్మ ఫోటోను మయన్మార్ లో తీసారట.1946 లో మహాత్మా గాంధీ మయన్మార్ వెళ్లిన సమయంలో బోసినవ్వులు చిందించే గాంధీ ఫోటోను తీసారట.ఆ ఫోటోనే ఇప్పుడు మనం కరెన్సీ పై చూస్తున్న ఫోటో.
విన్నారుగా గాంధీ ఫోటో ఎలా వచ్చిందో.