హెర్డ్ ఇమ్యునిటీ అంటే ఒకప్పుడు అసలు చాలామందికి తెలియదు.కానీ ఎప్పుడైతే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేసిందో అప్పటి నుంచే హెర్డ్ ఇమ్యూనిటీ అనే మాట తెరమీదకు వచ్చింది.
అందరూ ఇమ్యూనిటీ పవర్ కోసమే తపిస్తున్నారు.ఇమ్యూనిటీ బలంగా ఉన్న వారికి కరోనా రాదని అందరూ ఇమ్యూనిటీ పెంచుకునే పనిలో పడ్డారు.
చాలామంది ఇమ్యూనిటీ ఉన్న వారే కరోనా నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.కానీ ఇమ్యూనిటీ లేని వారు మాత్రం దానికి బలైపోయిన ఘటనలు కూడా చూస్తున్నాం.
అందుకే ప్రభుత్వాలు కూడా అందరికీ ఇమ్యూనిటీ పెంచే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.సామూహికంగా అందరూ ఈ వైరస్ ను తట్టుకునేంంత ఇమ్యూనిటీ పవర్‌ను సంపాదిస్తే గనక తప్పకుండా కరోనాను అధిగమించ వచ్చిని అప్పుడు దానికి చెక్ పెట్టడం ఈజీ అని సైంటిస్టులు కూడా చెబుతన్నారు.
మన దేశంలో చలా నగరాల్లో ప్రజలకు హెర్డ్ ఇమ్యునిటీపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ఇందుకోసం ప్రయత్నాలు కూడా చేయడంతో చాలా వరకు కేసులు తగ్గుతున్నాయి.అయితే ఇప్పుడు ఢిల్లీలో హెర్డ్ ఇమ్యునిటీ సంపాదించడం అత్యంత కష్టమైన పని అంటూ చెబుతున్నారు సైంటిస్టులు.
ఇందుకు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు అంతర్జాతీయ సైంటిస్టులు.ఒకవేళ ఢిల్లీ ప్రజలు ఇలా ఇమ్యూనిటీ కోసం ఇతర ప్రయత్నాలు ఏమైనా చేస్తే డెల్టాబారిన పడే ఛాన్స్ ఉందంటున్నారు.అలా కాకుండా బూస్టర్ డోసులు మాత్రమే తీసుకోవాలని ఇదొక్కటే వారిని మహమ్మారి నుంచి కాపాడుతుందంటూ చెబుతున్నారు సైంటిస్టులు.ఎందుకంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున వచ్చిన కేసుల్లో ఏ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందిందో తెలియట్లేదని, చాలామందిలో అల్ఫా వేరియంట్ ఉందన్నారు.
దాదాపు 40 శాతం కేసులు ఇవేనని కేంబ్రిడ్జివర్సిటీ, లండన్ సైంటిస్టులు చెబుతున్నారు.కాగా వీరంతా కూడా బూస్టర్ డోసు వేసుకుంటేనే బాగుంటుందని సూచిస్తున్నారు.