బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ఐదో సీజన్ లో ఐదో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అయ్యారు.హమీదా మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగితే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే హమీదా ఎలిమినేట్ కావడానికి కారణమేంటనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.హౌస్ లో శ్రీరామచంద్ర కోసం అందరినీ దూరం పెట్టడం ఆమెకు మైనస్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ కాల్చడం కూడా హమీదాకు మైనస్ గా మారింది.శ్రీరామచంద్రతో క్లోజ్ గా ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ సైతం హమీదాపై విమర్శలు చేశారు.
రేషన్ మేనేజర్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో హమీదా అందరితో ప్రవర్తించిన తీరు కూడా ఆమె ఎలిమినేట్ కావడానికి ఒక కారణమని చెప్పవచ్చు.అందరితో కలిసి ఆడి ఉంటే మాత్రం ఆమె ఎలిమినేట్ అయ్యేవారు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఒకరితో మాత్రమే క్లోజ్ గా ఉంటూ ఆడితే మాత్రం ఎలిమినేట్ కాక తప్పదని హమీదా ప్రూవ్ చేశారు.
కేవలం ఒకే ఒక సినిమాలో నటించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హమీదా ఎలిమినేట్ కాగా కొందరు మాత్రం క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షోపై ఆసక్తి తగ్గుతోందని కామెంట్లు చేస్తున్నారు.హమీదా శ్రీరామచంద్రల లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ హమీదాను ఎలిమినేట్ చేసి తప్పు చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోలేదు.ఈ సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీలకు బిగ్ బాస్ షో తర్వాత క్రేజ్ పెరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్5 లోకి పదిమంది లేడీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం గమనార్హం.