అమెరికాకు ప్రపంచ దేశాల నుంచీ వలస వాసులు వస్తుంటారు. అమెరికాలో విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అనేక రంగాలలో వలస వాసులకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
అమెరికా వచ్చే క్రమంలో ఎన్నారైలు తమ పిల్లలతో సహా వలస రావడంతో అప్పట్లో పెద్దగ ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు వారి పిల్లలకు 21 ఏళ్ళు రావడంతో అసలు చిక్కు వచ్చి పడింది.అమెరికా చట్టాల ప్రకారం ఎన్నారైల పిల్లలకు 21 ఏళ్ళు దాటినా తరువాత వారు డిపెండెంట్ గా పరిగణించబడరు.
దాంతో వారి అమెరికాను విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది.లేదంటే వారికి గ్రీన్ కార్డ్, లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉన్నా సరిపోతుంది.అలా లేనివారు దేశం విడిచి వెళ్ళాల్సిందే.అయితే
21 ఏళ్ళు నిండిన ఎన్నారైల పిల్లలను అమెరికా నుంచీ వెళ్ళగొట్టకుండా వారికి చట్టబద్దత కలిగించాలని ఎంతో మంది ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే వారిని అమెరికాలోనే ఉండేలా చట్టబద్దత కలిగించడానికి అలెక్స్ పడిల్లా, రాండ్ పాల్ అనే ఇద్దరు సెనేటర్లు “అమెరికా చిల్డ్రన్ యాక్ట్” పేరుతో సెనేట్ లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు.తల్లి తండ్రుల వీసాలపై ఆధారపడి ఉంటున్న పిల్లలను డాక్యుమెంటెడ్ డ్రీమర్ అంటారు.
ఇలాంటి వారు అమెరికాలో 2 లక్షల మంది ఉండగా వారిలో సుమారు 70 శాతం మంది భారత సంతతి పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది.అంటే
![Telugu America, America Senate, Americasenate, Dreamers, Green, Status, Nri-Telu Telugu America, America Senate, Americasenate, Dreamers, Green, Status, Nri-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/09/America-Children-Act-Immigrants.jpg)
“అమెరికా చిల్డ్రన్ యాక్ట్” గనుక అమలులోకి వస్తే భారీగా లబ్ది చేకూరేది భారతీయ ఎన్నారైల పిల్లలకే.ఒక వేళ ఈ బిల్లు గనక ఆమోదం పొందక పొతే వారికి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉండాలి అలా లేనివారు అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే లేదంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని.ఈ వీసాతో ఉపాది అవకాశాలు పొందే అవకాసం కూడా తక్కువగా ఉంటుంది.దాంతో ఎంతో మంది వలస వాసుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సెనేట్ లో ప్రవేశపెట్టిన “అమెరికా చిల్డ్రన్ యాక్ట్ బిల్లు” భారతీయ పిల్లలకు భారీ లబ్ది చేకూర్చనుందని తెలుస్తోంది.