కొత్త ఫీచర్ విడుదల చేసిన యూట్యూబ్..!

దిగ్గజ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్‌ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడానికి ఎల్లవేళలా కృషి చేస్తోంది.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసి యూజర్లను ఆకట్టుకున్న యూట్యూబ్ తాజాగా మరొక ఫీచర్ తీసుకొచ్చింది.‘ట్రాన్స్‌లేట్‌’ పేరిట ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్ల కోసం ఈ సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది.ఈ ఫీచర్ సహాయంతో ఇతర భాషల్లో ఉన్న యూట్యూబ్ కామెంట్లను క్షణాల్లోనే అనువదించవచ్చు.

 Youtube Has Released A New Feature Youtube Translate, Youtube Android, Youtube I-TeluguStop.com

ప్రస్తుతం యూట్యూబ్ మొబైల్ అప్లికేషన్ లో ఈట్రాన్స్‌లేట్‌బటన్ అందుబాటులో ఉంది.యూజర్లు దీనిపై పై క్లిక్ చేసి వందకు పైగా భాషలలో ఉన్న కామెంట్లను ట్రాన్స్‌లేట్‌ చేయొచ్చు.

స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బాహాసా, జపనీస్, ఉర్దూ, ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైగా భాషల ట్రాన్స్‌లేషన్ కు యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది.ఈ విషయాన్ని అధికారికంగా యూట్యూబ్ వెల్లడించింది.

Telugu Youtube Android, Youtube Ios, Youtube, Youtube Ups-Latest News - Telugu

ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమ్ అవుతున్న వీడియోల్లోని కామెంట్లు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేందుకు వీలుగా యూట్యూబ్ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పవచ్చు.యూట్యూబ్ మీ లొకేషన్ ప్రకారం ఇతర భాష కామెంట్లను ట్రాన్స్‌లేట్‌ చేస్తుంది.లేదా మీరు మీకు ఇష్టమైన భాషను సెలెక్ట్ చేసుకొని ఆ భాష లోకి కామెంట్లను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు.ట్రాన్స్‌లేట్‌ చేసిన తర్వాత ఒరిజినల్ టెక్స్ట్ ని కూడా చూడొచ్చు.

ఒకవేళ మీ యూట్యూబ్ యాప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube