ఆ మహిళలు కొత్తగా ఆలోచించారు.సమస్యను ఇలా కూడా తెలియచేయొచ్చా అని అనిపించేలా చేసారు.
రోడ్డుపైనే ఫ్యాషన్ షో మొదలు పెట్టేసారు.మహిళలు అందరు రోడ్ మీదే క్యాట్ వాక్ చేస్తుంటే అందరు అలా చూస్తుండిపోయారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం సృష్టించింది.అందరు వాళ్లనే చూస్తుండిపోయారు.
వాళ్ళని చూడడానికి ప్రజలు కూడా గుంపుగుంపులుగా వచ్చారు.అప్పుడు తెలిసింది.
వాళ్ళు అలా చేసిందే అందరు అక్కడికి రావడానికి అని.అప్పుడే అక్కడున్న సమస్య కూడా బయటపడింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని హోషంగాబాద్, ధనిశ్ నగర్ లో రోడ్లు బాగా లేవు.రోడ్లన్నీ గుంతలుగా ఉన్నాయి.దీనికి తోడు గత రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి.దీంతో ఆ గుంతల్లో నీళ్లన్నీ ఆగడంతో అందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎన్ని సార్లు ఇలా జరుగుతున్న అధికారులు ఎవ్వరు పట్టించుకోలేదు.దీంతో మహిళలు కొత్తగా ఆలోచించారు.
ఏదైనా కొత్తగా చేయాలని మహిళలందరూ ప్లాన్ చేసారు.నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు.
ధర్నా చేస్తే ఉపయోగం లేదని సమస్య ఎక్కడ ఉందొ అక్కడే ఫ్యాషన్ షో మొదలు పెట్టారు.క్యాట్ వాక్ చేస్తూ నిరసన చేపట్టారు.

మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరి మేము కడుతున్న డబ్బులు ఏమవుతున్నట్టు అని అధికారులని ప్రశ్నించారు.మేము దిగనంతవరకే ఏదైనా అని, మేము అడగనంత వరకే ఏదైనా అనేలా ఆదర్శంగా నిలిచారని కొందరు ప్రశంసిస్తున్నారు.మహిళలందరూ రోడ్డు మీదికి వచ్చి ఇలా చేయడంతో సమస్య అందరికి అర్థం అయ్యింది అన్నారు.
మహిళలు చేసిన క్యాట్ వాక్ ప్రదర్శన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇది చూసి ముందు ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్న వాళ్ళు విషయం తెలిసాక వాళ్ళని అభినందిస్తున్నారు.