నెట్ లేకున్నా గూగుల్ డ్రైవ్ పనిచేయాలంటే ఇలా చేస్తే సరి..!

ఇంటర్నెట్ వాడకానికి ప్రతి ఒక్కరు కూడా బాగా అలవాటు పడిపోయారు.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెట్ బ్యాలన్స్ వేపించుకుంటున్నారు .

 Google Drive, Network, Working, Technology, Updates, Latest News,drives Works Wi-TeluguStop.com

నెట్ బ్యాలన్స్ అయిపోతే ఏ మాత్రం డబ్బులు ఖర్చుపెట్టడానికి కూడా ఆలోచించకుండా నెట్ బ్యాలన్స్ వేపించుకుంటున్నారు.అంతలా నెట్ కి బానిసలు అయిపోయారు.

ఫేస్ బుక్ చూడాలన్నా, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్, యుట్యూబ్ ఇలా ఏది చూడాలన్నా గాని మొబైల్ నెట్వర్క్ అవసరం.అంతెందుకు మన మొబైల్ లో ఏది ఓపెన్ చేయాలన్నా ఇంటర్నెట్ అవసరం చాలా ఉంది.

ఈ క్రమంలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము.

ఇకమీదట నెట్ బ్యాలెన్స్ లేకపోయినా గాని మీరు మీ ఫైల్స్ ఓపెన్ చేసుకుని చూడవచ్చు.

అది ఎలా అంటే సాధారణంగా మనం ఏదైనా డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవాలంటే ఆ ఫైల్ ను గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని భద్రపరుచుకుంటాము కదా.అయితే మళ్ళీ ఆ డాకుమెంట్స్ తో ఏదన్నా అవసరం వచ్చి మళ్ళీ వాటిని ఓపెన్ చేయాలంటే తప్పకుండా ఇంటర్‌నెట్‌ ఉండితీరాలిసిందే.కానీ ఇకమీదట ఆ అవసరం లేదండోయ్.మీరు ఆఫ్‌ లైన్‌ లో ఉన్నప్పుడు కూడా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకున్న ఫైల్స్ తీసి చూసుకునే అవకాశాన్ని కల్పించింది గూగుల్.

Telugu Google Drive, Latest, Ups-Latest News - Telugu

అయితే ఎప్పుడో 2019 నుంచి ఈ ఫీచర్ గురించి పరిశీలించగా ప్రస్తుతం గూగుల్ తాజాగా వినియోగదారులందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది ఈ ఫీచర్ ను మీరు ఉపయోగించుకోవాలంటే ముందే మీరు డెస్క్ టాప్ యాప్స్‌ డౌన్లోడ్ చేసుకుని ఓకే అంటే చాలు.ఆ యాప్స్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయకపోయినాగాని బ్రౌజర్‌ ని సహాయంతో ఫైల్‌ లను ఓపెన్ చేయడానికి ఇది యూజర్స్ కు అనుమతి ఇస్తుంది.అంటే ఇకమీదట గూగుల్‌ డ్రైవ్‌ లో సేవ్ చేసుకున్న సమాచారం మళ్ళీ చూడాలంటే ఇంటర్నెట్‌ అవసరం లేదన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube