వింటర్ సీజన్ స్టార్ట్ అయింది.ఇప్పుడప్పుడే చలి( cold ) పెరుగుతుంది అయితే ఈ చలి కాలంలో కొందరు తీవ్రమైన హెయిర్ ఫాల్ తో బాధపడుతుంటారు.
వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు ప్రధాన కారణం.అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ ను కనుక వాడటం అలవాటు చేసుకుంటే వింటర్ లో హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
మరి ఇంతకీ ఆ మిరాకిల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు పాలకూర ఆకులు( Lettuce leaves ), నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు రెండు టీ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, కరివేపాకు, మెంతులు మిశ్రమాన్ని వేసుకోవాలి.
దీంతో పాటుగా వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము వేసి ఉడికించండి.

దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.జుట్టు చిట్లడాన్ని విరగడాన్ని నివారిస్తుంది.తెల్ల జుట్టు త్వరగా దరిచేరకుండా సైతం అడ్డుకుంటుంది.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను ప్రయత్నించండి.