బయటికి బహిర్గతమయ్యే శరీర భాగాల్లో చేతులు ఒకటి.అయితే చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ చేతులపై పెట్టరు.
నిత్యం ఎన్నో పనులు చేసే చేతుల విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు.ఫలితంగా చేతులపై ముడతలు ఏర్పడుతుంటాయి.
దాంతో ముసలి వారిలా కనిపిస్తుంటారు.ఇక అప్పుడు ముడతలు పడిన చేతులను రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను తప్పకుండా ఫాలో అవ్వండి.

గ్రీన్ టీ(
Green tea ) ముడతలను పోగొట్టి చేతులను అందంగా, మృదువుగా, కోమలంగా మార్చడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ పొడి, చిటికెడు పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాలు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చేతులతో నిత్యం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము.కాబట్టి చేతులు పై మురికి, మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి.అందుకోసం రెండు స్పూన్ల చక్కెరలో నిమ్మరసం( lemon juice ) కలిపి చేతులకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మురికి తొలగిపోయి చేతులు అందంగా తెల్లగా మారతాయి.ముడతలు పడకుండా ఉంటాయి.చేతులపై ముడతలను తొలగించడానికి గుడ్డు కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఒక ఎగ్ వైట్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
తరచూ ఈ విధంగా చేస్తే ముడతలు పోయి చేతులు మృదువుగా మారతాయి.