ఉల్లితో ఇన్ని ప్రయోజనాలా.. ఇంతకీ ఏయే సమస్యకు ఎలా వాడాలి?

ఉల్లిపాయలు.( Onions ) నిత్యం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో వీటిని విరివిరిగా వినియోగిస్తారు.ఉల్లి లేనిదే ఏ వంట సంపూర్ణం కాదు.అయితే ఉల్లి వంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.నిజానికి ఉల్లి లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

 Wonderful Health Benefits Of Onion Details! Onion, Onion Benefits, Health, Healt-TeluguStop.com

ఉల్లితో ఎన్నో సమస్యలకు కూడా అడ్డుకట్ట వేయొచ్చు.అయితే ఉల్లిని ఏయే సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఒక్కోసారి విపరీతమైన కడుపునొప్పి ( Stomach Pain ) వస్తుంటుంది.అలాంటి సమయంలో నొప్పి తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్ ను వేసుకుంటారు.అయితే కడుపు నొప్పిని నివారించడానికి ఉల్లి అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఉల్లి రసం, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవాలి.

ఉల్లిని ఈ విధంగా తీసుకుంటే కడుపు నొప్పి దెబ్బకు మాయమవుతుంది.

Telugu Cancer, Tips, Benefits, Stomach Ache, Suger Levels, Urine-Telugu Health

అలాగే ఒక గ్లాస్ నీటిలో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఉల్లి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ వాటర్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే మూత్రాశయంలో మంట దూరం అవుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్( Urine Infection ) సమస్య నుంచి బయటపడతారు.ఈ ఉల్లి వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి సైతం తొలగిపోతుంది.

Telugu Cancer, Tips, Benefits, Stomach Ache, Suger Levels, Urine-Telugu Health

ఇక పచ్చి ఉల్లిపాయను రోజు తీసుకుంటే ఆడవారిలో నెలసరి సమస్యలు దూరం అవుతాయి.బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.అంతేకాదు పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుంది.దంతాలు దృఢంగా మారతాయి.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

జీర్ణ వ్యవస్థ సైతం చురుగ్గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube