ఇప్పుడు ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా బయటికి వెళ్లాల్సిన పని లేదు.మనకు కావాల్సినవి అన్ని ఆన్ లైన్ లోనే దొరుకుతున్నాయి.
పట్నం నుంచి పల్లె వరకు ఈ వ్యాపారం జరుగుతుంది.ఈ ఆన్ లైన్ వ్యాపారాల గురించి అందరికి తెలిసిందే.
ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ఈ ఆన్ లైన్ సర్వీస్ మరింత దగ్గరైంది.వ్యాపారాలన్నీ ఆన్ లైన్ లోనే జరగడం మొదలయాయ్యి.
ఏదైనా ఆన్ లైన్ లో కొంటున్నారు, అమ్ముతున్నారు.అయితే ఇందులో స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా.? స్పెషల్ ఉంది.వైరల్ అవుతున్న వాటిలో ఇది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అన్ని అమ్ముతున్నట్టే వేపపుల్లలను అమ్మడం ఆశ్చర్యం ఏమి కాదు.కానీ దాని రేట్ అందరిని నిజామా అని ఆశ్చర్యానికి గురిచేసింది.ఒక వేపపుల్ల 1800 రూపాయలట.పళ్ళు తోముకునే వేప పుల్ల 1800 ఉండడం ఏంటని చూసిన వారు షాక్ అయ్యారు చాలా మంది.
అమెరికా ఈ కామర్స్ కంపెనీ ఆన్ లైన్లో వేపపుల్లని ఈ రేట్ కి అమ్మకానికి పెట్టింది.ఆర్గానిక్ టూత్ బ్రష్ గా చెబుతూ $24.99గా ధర నిర్ణయించింది.అంటే మన ఇండియా కరెన్సీలో దాని ధర 1825.34 రూపాయలు.
అయితే ఆ కంపెనీ ఈ వేపపుల్లని ఎలా ఉపయోగించాలో అర్థం అయ్యేలా చెప్పడం విశేషం.
ముందుగా వేపపుల్లను తీసుకుని ఒక అంచున గట్టిగా కొరకాలి.

అప్పుడు వేపపుల్ల బ్రష్ లాగా మారుతుంది.దాంతో చిగుళ్ళ వరుసవైపు పళ్ళు తోమాలి.ఈ వేపపుల్లతో పళ్ళు తోమితే చాలా మంచిదని పేర్కొంది.
అయితే ఒకసారి ఉపయోగించి పారేయకుండా మళ్ళీ ఆ వేపపుల్లని ఉపయోగించే అవకాశం ఉందని తీసుకునేవారికి అర్థం అయ్యే విధంగా తెలిపింది.అయితే పల్లెల్లో ఈ వేపపుల్లలు ఉచితంగా దొరుకుతాయి.
వాటి ధర ఆన్ లైన్ లో 1800 చూపించేసరికి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇదేం మొదటిసారి కాదు.
గతంలో కూడా ఇలానే వేపపుల్లను ఆన్ లైన్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే వార్తలు అప్పుడు చక్కర్లు కొట్టాయి.ఇప్పుడు తాజాగా మరోసారి వేపపుల్ల రేట్ గురించి చర్చ మొదలైంది.