కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.అనేక రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులకు ప్రాణాలు వదిలారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టింది.థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.
కరోనా వల్ల ఇప్పటి వరకు స్కూల్ విద్యార్థులు ఇంటికే పరిమితం కావలసి వచ్చింది.పిల్లల్లో ఎక్కువగా జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, జీర్ణాశయ సమస్యలు ఉన్నప్పటికీ వారికి ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే టెస్టు చేయించడం మంచిది.
కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్న కొందరు పిల్లల వల్ల టీనేజ్ లో ఉండేవారికి కూడా ఆ లక్షణాలు పాకే అవకాశం ఉంది.చర్మంపై గాయాలు అవ్వడం, ముఖ్యంగా కాలి వేళ్ళ మీద కురుపులు వంటివి రావడం జరుగుతాయి.
ఇవి చాలా అరుదుగా బయటపడతాయి.వీటిని గమనించి పిల్లల్ని బయటి ప్రాంతాల్లో ఎక్కువగా తిప్పకుండా ఇంట్లోనే ఉంచడం ఎంతో ఉత్తమం.
పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాలి.కొంతమంది పిల్లలకు ఈ లక్షణాలు రావడం జరుగుతూ ఉంటుంది.అయితే ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించి లేదా కరోనా టెస్ట్ చేయడం మంచిది.వారిని బయటకు రాకుండా చూడాలి.
వెంటనే వారికి మంచి పోషకాహారాన్ని అందించాలి.తగిన మందులు ఇచ్చి తగ్గించగలిగే డీహైడ్రేషన్ రాకుండా ఉండాలి.

చిన్నారులకు ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలినట్లయితే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.మీరు ఏమాత్రం భయపడాల్సిన పనిలేకుండా ఇంట్లోని మిగతా వారికి కూడా టెస్ట్ చేయించుకోవాలి.పిల్లల్లో కరోనా నివారణకు మందులు ఇంకా లేనందువలన వారికి సరైన విశ్రాంతి ఇవ్వడం, హైడ్రేటెడ్ గా ఉండటానికి జ్యూస్ లు ఇస్తుండం మంచిది.కరోనా సోకిన చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం మంచింది.
ఒకవేళ చిన్నారులు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్య నిపుణుల వద్దకు వెల్లి వారి సూచనలను పాటించాలి.