దేశరక్షణలో పోలీసులు పాత్ర కీలకమైంది.ప్రతి ఇంట్లో అందరూ గుండెలపై హాయిగా నిద్రపోతున్నారంటే బార్డర్ లో ఉండే సైనికులు, ప్రజలతో కలిసి తిరిగే పోలీసులే అందుకు కారణం.
మరి అలాంటిది వారిని లెక్కచేయకపోతే సీన్ వేరేలా ఉంటుంది.ఈ మద్యకాలంలో పోలీసుల కళ్లుగప్పి చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు.
పోలీసులపై దాడులు కూడా పెరిగిపోయాయి.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఓ పోలీసును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు.కారు ముందు పోలీసు ఉన్నా కూడా కారును స్పీడ్ గా పోనిస్తూ వెళ్లాడు.పంబాజ్ లోని పాటియాలాలో ఈ ఘటన జరిగింది.సెక్యూరిటీ చెక్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగింది.
ఆగస్టు 15వ తేదీన పోలీసులు పాటియాలలో చెకింగ్ నిర్వహిస్తున్నారు.ఆ టైంలో అక్కడికి ఓ కారు వచ్చింది.
పోలీసులు ఆ కారును ఆపాలని చూశారు.అయినా ఆ కారు ఆగలేదు.
పోలీసును ఢీకొంటూ
కారును స్పీడ్
ముందుకు కదిపారు.కారు నుంచి పోలీసులు ఎగిరి పడ్డాడు.
దీంతో ఆ పోలీసులుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దాంతో గాయాలపాలైన పోలీసును హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
ఆయనకు ట్రీట్మెంట్ చేశారు.ప్రస్తుతం ఆ పోలీసు పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనకు కారణమైన కారును పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కారును పట్టుకుంటున్నామని తెలియజేశారు.ఆ తర్వాత కారు ఆచూకీని తెలుసుకున్నారు.నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్నామని, ఆ వ్యక్తిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా డిఎస్పీ హేమంత్ శర్మ తెలియజేశాడు.
కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లుగా తెలిపాడు.నిందితుడు ఆ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి ఉండటం వల్ల కారును అంతలా స్పీడ్ తో తోలినట్లుగా తెలిపాడు.
ప్రస్తుతం ఈ కారు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.