వైద్యులు అంటే కనిపించే దేవుళ్లు అంటారు.కానీ నేటి కాలంలో వైద్య వృత్తి పూర్తిగా కాసుల సంపాదనగా, నిర్లక్ష్యంగా మారింది.
వైద్యో నారాయణ హరి అనే పదం పూర్తిగా మాయం అయ్యింది.ఇక అప్పుడప్పుడు డాక్టర్లు చేసిన పని రోగుల ప్రాణం మీదకు వస్తుందని తెలిసిందే.
ఇలా ప్రమాదవశాత్తు బతికి బట్టకట్టిన వారున్నారు.పాడే ఎక్కిన వారున్నారు.
ఇకపోతే గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు చేసిన నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు వచ్చిందట.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.స్దానికంగా ఉంటున్న వినిత అనే వివాహిత దుండహేరా గ్రామంలోని పార్క్ అనే ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 23న గర్భస్రావం చేసుకుందట.
ఇందులో భాగంగా డాక్టర్స్ యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇచ్చారు.ఈ క్రమంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కుడి చెయి నల్లగా మారడం మొదలు పెట్టిందట.
దీనికి కారణం ఈ మహిళ శరీరం ఇన్ఫెక్షన్‌కు గురైందని తెలిసింది.కాగా వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా ఇన్ఫెక్షన్‌కు గురైన చేయిని వెంటనే తొలగించాలని అక్కడి వైద్యులు తెలిపారట.
అసలే కొవిడ్ కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఈ మహిళ భర్త తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గొల్లుమంటున్నాడట.