టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్.ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ సంపాదించుకుంది.
అంతేకాకుండా వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది.స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది.
అలనాటి తార సావిత్రి బయోగ్రఫీ లో నటించి మొత్తానికి మహానటి గా పేరు అందుకుంది కీర్తి సురేష్.ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలతో మంచి సక్సెస్ లను తన ఖాతాలో నింపుకుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే స్టార్ హీరో సినిమాలో మరో క్రేజీ పాత్రలో నటిస్తుంది కీర్తి.
కీర్తి సురేష్ సినిమా కంటే పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.అలా ఇప్పటివరకు తను నటించిన పాత్రలకు మంచి సక్సెస్ కూడా అందుకుంది.ఇక ప్రస్తుతం ఓ స్టార్ హీరో కి చెల్లిగా నటిస్తుందట.ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్.
ఈయన ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాతే‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ కు ముద్దుల చెల్లిగా కనిపించనుందట.
![Telugu Annaatthe, Keerthy Suresh, Rajinikanth, Tollywood-Movie Telugu Annaatthe, Keerthy Suresh, Rajinikanth, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/05/Keerthy-SureshSuper-Star-Rajinikanth-Annaatthe-Movie-tollywoood-kollywood.jpg)
అంతేకాకుండా ఇటీవల తన షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుందట ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ సినిమాలో ఈ పాత్ర ఒప్పుకోడానికి ఓ కారణం ఉందట.ఈ పాత్ర ఈ సినిమాలో కీలక పాత్ర కావడంతో సినిమాను టర్న్ చేసే పాత్రగా ఉంటుందట.అందుకే కీర్తి ఈ పాత్ర చేయడానికి ఇష్ట పడిందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో బిజీగా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.