స్టార్ హీరోయిన్ శృతిహాసన్ రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా శృతిహాసన్ తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కమల్ హాసన్ తనయగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ నటి కావడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, డ్యాన్సర్ గా కూడా సత్తా చాటుతున్నారు.
ఏ విషయం గురించైనా బోల్డ్ గా మాట్లాడే శృతి తల్లి సారిక, కమల్ హాసన్ విడిపోవడం గురించి చెబుతూ తన తల్లిదండ్రులు విడిపోవడం సంతోషమేనని అన్నారు.
బలవంతంగా తన తల్లి, తండ్రి కలిసి ఉండటం సరికాదని విడిపోయిన తరువాతే వారు సంతోషంగా ఉన్నారని శృతి వెల్లడించారు.తన తల్లి, తండ్రి అద్భుతమైన వ్యక్తులు అని శృతి హాసన్ పేర్కొన్నారు.
తన చిన్న వయస్సులోనే వాళ్లు ఒకరితో మరొకరు విడిపోయారని ఆమె పేర్కొన్నారు.
తల్లితో పోలిస్తే తాను తండ్రితోనే ఎక్కువ క్లోజ్ అని శృతిహాసన్ వెల్లడించారు.
కమల్ హాసన్ మొదటి వాణి గణపతి అనే డ్యాన్సర్ ను వివాహం చేసుకోగా కొన్ని కారణాల వల్ల వాణి కమల్ విడిపోయారు.ఆ తర్వాత కమల్ సారికను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు.2004 సంవత్సరం కమల్, సారిక విడాకులు తీసుకున్నారు.

శృతిహాసన్ తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ నటిగా సత్తా చాటుతున్నారు.
సలార్ మూవీలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.2015 సంవత్సరంలో అక్షర హాసన్ షమితాబ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.అక్షర హాసన్ హిందీ సినిమాల్లో నటించగా ఆమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.అక్షర హాసన్ తెలుగు సినిమాల్లో నటించలేదు.రాబోయే రోజుల్లో అక్షర తెలుగు సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.