కరోనాకు ఇంగ్లీష్ మందులను నమ్ముకోవడం కన్నా ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేదం మూలికల మందుని నమ్ముకుంటే బెటర్ అని ఫిక్స్ అయ్యారు కరోనా బాధితులు.నెల్లూరులో కొంతకాలంగా కరోనాకు నాటు మందు ఇస్తున్న ఆనందయ్య ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.30 ఏళ్లుగా ఆయుర్వేదంలో అనుభవం ఉన్న ఆయన కరోనాని కేవలం 3, 4 రోజుల్లో తగ్గించే మందులు ఇస్తున్నారు.అంతెకాదు ఆక్సీజన్ కొరత ఉన్న రోగులకు మందు ఇచ్చి వారికి వెంటనే స్వయంగా ఆక్సిజన్ తీసుకునేలా చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని బొనిగి ఆనందయ్య చేస్తున్న మందుకి డిమాండ్ బాగా పెరిగింది.ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం ప్రారంభించాలని అన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
ఈ మేరకు ఆయుష్ ఇంచార్జ్ మంత్రి కిరణ్ రిజిజు, ఐసిఎమార్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్ కు సూచించారు.వారిద్దరికి ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆనందయ్య కరోనా ఔషధంపై వెంటనే అధ్యయనం ప్రారంభించాలని సాధ్యమైంత త్వరగా నివేదిక ఇవ్వాలని చెప్పారు.
అయితే కృష్ణ పట్నంలో పరిస్థితి చూస్తే మాత్రం ఆనందయ్య ఆయుర్వేదం మందుకు పర్మిషన్ వచ్చినా రాకున్నా కూడా ప్రజలు దాన్ని వాడేలా ఉన్నారు.శుక్రవారం రోజు దాదాపు 50 వేల మంది దాకా ప్రజలు అక్కడ మందు కోసం వచ్చారని తెలుస్తుంది.