ఈ మధ్య కాలంలో నెటిజన్లు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే కామెంట్లు పెడుతూ సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే భయపడేలా చేస్తున్నారు.అసభ్యకర కామెంట్లు పెడుతూ సెలబ్రిటీలతో మరికొందరు నెటిజన్లు చీవాట్లు తింటున్నారు.
తాజాగా ఒక నెటిజన్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని ఒక నెటిజన్ న్యూడ్ ఫోటోలు అడగగా చిన్మయి ఘాటుగా స్పందించడంతో పాటు నెటిజన్ కు బుద్ధి వచ్చేలా సమాధానం ఇచ్చారు.
ఫెమినిస్ట్ గా పేరును సంపాదించుకున్న చిన్మయి స్టార్ హీరోయిన్స్ లో సమంత, రకుల్ లకు డబ్బింగ్ చెబుతారనే సంగతి తెలిసిందే.
సమంతకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో సినిమాల్లో వినిపించే సమంత గొంతుకు కూడా అదేస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఒక నెటిజన్ న్యూడ్ ఫోటోలు పంపాలని మెసేజ్ చేయగా చిన్మయి ఆ నెటిజన్ కు స్వయంతృప్తి పొందాలని కావాలంటే గైనకాలజిస్ట్ తో మాట్లాడి ప్రాక్టీస్ చేయాలని ఆమె అన్నారు.
తనను న్యూడ్ ఫోటోలు అడిగిన వ్యక్తి మనిషిగా ఉండటం నేర్చుకోవాలని ఈ విధంగా అడగటం లైంగిక వేధింపుల కిందికి వస్తుందని ఆమె పేర్కొన్నారు.ఒకసారి తండ్రితో మాట్లాడితే ఆడపిల్లలతో ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తాడని ఆమె పేర్కొన్నారు.
కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండు అంటూ నెటిజన్ కు సూచనలు చేశారు.మీరు ఒకవేళ పేరెంట్ అయితే అతనికి అవసరమైన సహాయం చేయమని చిన్మయి వెల్లడించారు.
తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని విషయాలపై అవగాహన ఉండేలా చేయాలని అవగాహన కలిగేలా చెప్పలేకపోతే కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లాలని తెలిపారు.పిల్లలను తిట్టడం, అవమానించడం మాని తల్లిదండ్రులు పిల్లలను కౌన్సిలింగ్ కు తీసుకొని వెళితే వాళ్లకు సహాయం చేసిన వాళ్లు అవుతారని ఆమె చెప్పుకొచ్చారు.చిన్మయి సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.