ఒకే ట‌వ‌ల్‌ను రోజుల త‌ర‌బ‌డి వాడుతున్నారా..అయితే రిస్క్ త‌ప్ప‌దు!

సాధార‌ణంగా రోజులో ఎన్నో సార్లు ట‌వ‌ల్‌ను వాడుతుంటారు.చెమ‌ట తుడుచుకునేందుకు, స్నానం చేసిన త‌ర్వాత నీట తడిసిన ఒంటిని శుభ్రం చేసుకునేందుకు, త‌ల‌ను ఆర‌బెట్టుకునేందుకు, చేతులను, కాళ్ల‌ను క్లీన్ చేసుకునేందుకు ఇలా అనేక పనుల కోసం ట‌వ‌ల్‌ను యూజ్ చేస్తుంటారు.

 What Ahappens If You Use The Same Towel For Days At A Time? Towel, Using Towel,-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని పొర‌పాట్లు కూడా చేస్తుంటారు.ఈ పొర‌పాట్లే ఆరోగ్యానికి ముప్పుగా మార‌తాయి.

ముఖ్యంగా చాలా మంది ఒకే ట‌వ‌ల్‌ను రోజుల త‌ర‌బ‌డి వాడుతుంటారు.

చిరగలేదు, బాగానే ఉంది అనే కారణాలతో ట‌వ‌ల్‌ను వాడుతూనే ఉంటారు.

కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.ప‌దే ప‌దే ట‌వ‌ల్స్‌ను వాష్ చేయ‌డం వ‌ల్ల అవి బిరుసుగా తయారైపోతాయి.

అందువ‌ల్ల‌, వీటిని రోజుల త‌ర‌బ‌డి వాడితే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.సో ట‌వ‌ల్‌ను నాలుగు లేదా ఐదు నెల‌ల‌కు మారుస్తూ ఉండాలి.

Telugu Tips, Latest, Towel-Telugu Health - తెలుగు హెల్త్

అలాగే చాలా మంది ట‌వ‌ల్‌ను వాడిన త‌ర్వాత కుర్చీల‌పై, సోఫాల‌పై, బెడ్‌ల‌పై ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేస్తుంటారు.మ‌ళ్లీ అక్క‌డ నుంచే తీసుకుని వాడుతుంటారు.కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల ట‌వల్‌లో త‌డి అలానే ఉంటుంది.దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.ఈ బ్యాక్టీరియా మీ శ‌రీరానికి ప‌ట్టేసి జ‌బ్బుల బారిన ప‌డుతుంటారు.కాబ‌ట్టి, ట‌వ‌ల్‌ను వాడిన త‌ర్వాత గాలి త‌గిలే చోట ఆర‌బెట్టుకోవాలి.

ఇక ట‌వ‌ల్స్‌ను వాడుతుంటారు.కానీ, ఉత‌క‌రు.అలా ఉత‌క‌కుండానే ప్ర‌తి రోజు యూజ్ చేస్తుంటారు.ఇదే పొర‌పాటు.

వాష్ చేయ‌కుండా ఉంటే ట‌వ‌ల్స్‌లో కోలిఫామ్ అనే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.అలాంటి ట‌వ‌ల్‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, ట‌వ‌ల్స్‌ను డే బై డే ఖ‌చ్చితంగా ఉతుక్కోవాలి.అది కూడా వేడి నీటితో వాష్ చేసుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube