తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా అప్పుడప్పుడు బయటికి వచ్చి తానూ రాజకీయాలలో ఉన్నానని చూపించుకుంటున్నట్లు చేస్తొందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేసిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన తరువాత కీలకమైన స్థాయిలో ఒక ఎంపీగా, టీఆర్ఎస్ పార్టీలో కీలకపదవిని ఇచ్చి కేసీఆర్ రాజకీయంగా విజయశాంతికి మంచి అవకాశాలిచ్చాడనే చెప్పవచ్చు.
ఆ తరువాత టీఆర్ఎస్ తో రకరకాల కారణాల వల్ల అభిప్రాయభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది.ఆ తరువాత కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేకుండా మరల రాష్ట్రంలో బీజేపీ కొంత పుంజుకుందని బీజేపీలో చేరింది.
అయితే తాజాగా నాగార్జున సాగర్ లో పర్యటించిన రాములమ్మ కేసీఆర్ పై నిప్పులు చెరిగింది.కేసీఆర్ వచ్చి హామీలు ఇవ్వడం కాదని, ఆ హామీలను నెరవేర్చి చూపించాలని, ఝాటా మాటలు బంద్ చేయాలని కేసీఆర్ ఘాటుగా స్పందించింది.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కెసీఆర్ కె దక్కుతుందని, కెసీఆర్ పరిపాలనతో ప్రజలు అష్టకష్టాలకు గురవుతున్నారని విజయశాంతి మండిపడింది.నాగార్జున సాగర్ లో దెబ్బకు కెసీఆర్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావాలని విజయశాంతి అభిప్రాయ పడింది.