ఆ పదవి కోసం రోజాకు రూ.40 లక్షలు.. పదవి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు.. వార్డ్ కౌన్సిలర్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటి, మంత్రి రోజా( Minister Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నగరి నియోజకవర్గం( Nagari Constituency ) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

 Puttur Ward Councillor Sensational Comments On Minister Roja Goes Viral In Socia-TeluguStop.com

అయితే రోజా గురించి తొలిసారి అవినీతి ఆరోపణలు వినిపిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.వార్డ్ కౌన్సిలర్ మీడియాతో మాట్లాడుతూ రోజా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను పుత్తూరు ( Puttur ) 17వ వార్డ్ కౌన్సిలర్ అని నా పేరు భువనేశ్వరి( Bhuvaneshwari ) అని 22 వార్డులలో యునానిమస్ గా గెలిచిన ఏకైక కౌన్సిలర్ నేనేనని ఆమె చెప్పుకొచ్చారు.నేను గెలిచిన తర్వాత రోజా గారిని కలిశానని ఆ సమయంలో రోజాగారు ఛైర్మన్ ( Chairman ) నువ్వేనని అన్నను కలవాలని సూచించారని భువనేశ్వరి పేర్కొన్నారు.

రోజా అన్న కుమారస్వామి నా నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Roja, Chairman Seat, Kumaraswamy, Puttur, Putturward, Roja Demand, Sensat

మూడు విడతలలో 40 లక్షల రూపాయలు ఇచ్చానని అయితే ఎలక్షన్ అయిన తర్వాత ఛైర్మన్ నాకు ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.రెండేళ్ల తర్వాత ఇస్తానని కుమారస్వామి చెప్పారని చివరకు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పారని భువనేశ్వరి కామెంట్లు చేశారు.డబ్బులు వెనక్కివ్వాలని అడిగితే ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Telugu Roja, Chairman Seat, Kumaraswamy, Puttur, Putturward, Roja Demand, Sensat

రోజాగారికి మెసేజ్ పెడితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని భువనేశ్వరి తెలిపారు.డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయాని ఆమె కామెంట్లు చేశారు.నమ్మించి మోసం చేశారని భువనేశ్వరి కామెంట్లు చేశారు.భువనేశ్వరి ఆరోపణల గురించి రోజా( Roja ) ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు రోజా పొలిటికల్ కెరీర్ పై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.రోజా ఈ ఆరోపణలపై స్పందించకపోతే ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube