ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం తెలుగు, తమిళ, ఇతర దక్షిణాది భాషల్లో విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.మరో రెండు మూడు సంవత్సరాల వరకు కొత్త సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతికి చేదు అనుభవం ఎదురైంది.
రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న నేపథ్యంలో విజయ్ సేతుపతిని చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంతో పాటు నిబంధనలు పాటించకుండా షూటింగ్ చేస్తున్నందుకు చితయూనిట్ కు జరిమనా విధించినట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
పాత్ర నచ్చితే చిన్నాపెద్ద సినిమాలనే తేడాల్లేకుండా అందరు హీరోల సినిమాల్లో నటిస్తున్న విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు.పాత్ర నచ్చితే విజయ్ సేతుపతి పారితోషికం విషయంలో తగ్గుతారని తెలుస్తోంది.
అయితే విజయ్ సేతుపతి ఒక కోలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటుండగా షూటింగ్ చూడటం కొరకు జనం పెద్దఎత్తున షూటింగ్ జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.
![Telugu Vijay Setupati, Cancelled, Amount Fine, Kollywood-Movie Telugu Vijay Setupati, Cancelled, Amount Fine, Kollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/03/actor-vijay-setupati-cancelled-movie-shooting-huge-amount-fine-kollywood-media.jpg )
చిత్రనిర్మాతలు సెక్యూరిటీని బాగానే ఏర్పాటు చేసినా పెద్ద సంఖ్యలో జనం రావడంతో షూటింగ్ జరిగే ప్రదేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.కరోనా విజృంభిస్తున్న తరుణంలో జనం ఒకేచోట గుంపులుగుంపులుగా చేరడంపై కోలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.విజయ్ సేతుపతి జనాలకు నచ్చజెప్పాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.
అక్కడ గొడవ లాంటి పరిస్థితులు ఏర్పడటంతో షూటింగ్ లో పాల్గొన్న ఒక వ్యక్తి బైక్ పై విజయ్ సేతుపతి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిబంధనలు పాటించని చిత్రయూనిట్ కు భారీగా జరిమానా విధించారని సమాచారం.
ఎప్పుడూ పాజిటివ్ విషయాలతో వార్తల్లో నిలిచే విజయ్ సేతుపతి ఈరోజు మాత్రం నెగిటివ్ విషయంతో వార్తల్లో నిలవడం గమనార్హం.