మనం సహజంగా అక్రమ రవాణా చేయడానికి అనేక మంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం.కొంత మంది వారు ధరించే దుస్తుల్లో లేదా షూ లలో బంగారం లేదా విదేశీ అక్రమ రవాణా చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
కానీ తాజాగా ఒక ఇద్దరు వ్యక్తులు విగ్గులో బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు కస్టమ్స్ అధికారులు కనిపెట్టారు.వీరిని చెన్నై విమానశ్రమంలో బంగారాన్ని , విదేశీ కరెన్సీ ని అక్రమ రవాణా చేసే ప్రయత్నం చేయగా అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు.ఇక వీరి ఇద్దరి దగ్గర నుంచి 5.5 కేజీల బంగారాన్ని, అలాగే 20 లక్షల విలువగల విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు, ఇక ఆ బంగారం విలువ దాదాపు రూ .2.53 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కస్టమ్స్ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం… రామనాథపురంనికి చెందిన మగ్రూబ్ అక్బరాలీ (39), చెన్నైకి చెందిన హసన్ రఫియుద్దీన్ (26)ల హెయిర్ స్టైల్ చాలా విచిత్రంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఎగ్జిట్ గేటు వద్ద వాళ్లను ప్రశ్నించారు.వాళ్లని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పాక్షికంగా గుండు చేయించుకొని విగ్గులు ధరించినట్లు అర్థమయింది.
వీరి ఇద్దరి విగ్గులలో రెండు బంగారు ముద్ద పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు.
![Telugu Chennai Airport, Customes, Cutoms, Goldforeign, Gold, Strange Gold, Wigs- Telugu Chennai Airport, Customes, Cutoms, Goldforeign, Gold, Strange Gold, Wigs-](https://telugustop.com/wp-content/uploads/2021/03/custom-officers-caught-two-persons-the-smuggling-gold-from-hair.jpg )
అలాగే ఇటీవల కాలంలో కస్టమ్స్ అధికారులు జరిపిన సోదాల్లో సయ్యద్ అహ్మదుల్లా (22), సంతోష్ సెల్వం (33), అబ్దుల్లా (35) ముగ్గురు వ్యక్తులు కూడా విగ్గు ద్వారా బంగారాన్ని దాచి పెట్టి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించారు.ఇది గమనించిన అధికారులు కూడా వెంటనే అదుపులోకి తీసుకొని, వీరి వద్ద నుంచి 2410 గ్రాముల బంగారు గల గోల్డ్ వేస్ట్ ప్యాకెట్ లను కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.