దత్తత, సరోగసీలపై కేంద్రం మార్గదర్శకాలు.. సమీక్ష కావాలంటున్న ప్రవాసులు

ఈ రోజుల్లో చాలా మంది దంపతుల్లో కనిపిస్తున్న సాధారణ సమస్య సంతాన లేమి.పెళ్లై ఏళ్లు గడుస్తున్నా చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు.

 Surrogacy Laws For Overseas Citizens Need Review, Surrogacy Laws , Overseas Citi-TeluguStop.com

ఆధునిక కాలం, మారుతున్న ఆహారపు అలవాట్లు, శ్రమ లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతే ఈ సమస్య.పెళ్లయి 10 ఏళ్లయినా ఇంకా సంతానం కలగలేదా? ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండాపోయిందా? ఈ ప్రశ్నలకు ఔనని చెప్పే దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది.వాస్తవానికి పెళ్లి అనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే.సంతానం కలిగితేనే ఆ జీవితం సంపూర్ణమవుతుంది.అయితే, సంతానలేమి సమస్యతో ఎంతో మంది దంపతులు ఒక అసంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు.దీంతో సంతాన సాఫల్య కేంద్రాలు, దత్తత కార్యక్రమాలు నిర్వహించే కన్సల్టెన్సీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది.

అలాగే సరోగసి (అద్దె గర్భం)కి సైతం విపరీతంగా డిమాండ్‌ ఏర్పడుతోంది.

వృత్తి రిత్యా కానీ.

అనారోగ్య సమస్యల వల్ల గానీ సొంతంగా పిల్లలను కనలేని ధనిక మహిళలు ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు.పిల్లల కావాలనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది.

సరోగసి ప్రక్రియ విధానంలో భార్యభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరింపజేసి అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు.ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అండం లేదా వీర్యం లభించకపోతే దాతల నుంచి సేకరిస్తారు.

సరోగసికి భారతదేశం ఒక కేంద్రంగా మారుతోంది.యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటినా, బ్రెజిల్, ఐర్లాండ్, మంగోలియా, ఇజ్రాయిల్ ఇలా పలుదేశాల వారు మన దేశానికి వస్తున్నారు.

అన్ని దేశాలను వదలేసి మన దేశానికే రావడానికి కారణం ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే.తక్కువ ధరకే సరోగసి తల్లులు మన దేశంలో దొరుకుతున్నారు.

పేద మహిళలకు కొందరు దళారులు, ఫెర్టిలిటి సెంటర్లు డబ్బు ఆశచూపి సరోగసి ద్వారా పిల్లలను తీసుకెళ్తున్నారు.

Telugu Foreign, Nris, Citizens, Surrogacy Laws, Surrogacylaws, Surrogacy-Telugu

అయితే కొందరు దంపతులు మాత్రం దత్తత వైపే మొగ్గుచూపుతున్నారు.ముఖ్యంగా విదేశాల స్థిరపడిన ఎన్ఆర్ఐలు, భారత మూలాలున్న వ్యక్తులు దత్తత కోసం మనదేశంలో ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దత్తత, సరోగసిలను చట్టపరిధిలోకి తీసుకొచ్చి నిఘా పెంచింది.

అయితే ఈ ఏడాది మార్చి 4న భారత హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన 4 నోటిఫికేషన్లు దత్తత, సరోగసిల ద్వారా తల్లిదండ్రులు కావాలని భావిస్తున్న ఎన్ఆర్ఐలను గందరగోళంలోకి నెట్టింది.

దీని ప్రకారం ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ విషయాలలో ఎన్ఆర్ఐలను ఓసీఐ దారులతో సమానంగా చేశారు.

గెజిటెడ్ ఇండియన్ అడాప్షన్ రెగ్యులేషన్ , 2017 (ఏఆర్) ప్రకారం.భారతీయ పౌరుడిని దత్తత తీసుకునేటప్పుడు ఎన్ఆర్ఐలను భారతీయ ప్రజలతో సమానంగా చూస్తుంది.

అయితే సరోగసీ రెగ్యులేషన్ బిల్లు, 2020.ఓసీఐ కార్డుదారులకు సరోగసీని అనుమతించాలని ప్రతిపాదించినప్పటికీ .మార్చి 4న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో దాని గురించి ప్రస్తావించలేదు.

Telugu Foreign, Nris, Citizens, Surrogacy Laws, Surrogacylaws, Surrogacy-Telugu

మన రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు.మరొక దేశం యొక్క పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందిన తరువాత, ఒక వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉనికిలో ఉండడు.అలాగే భారతీయ సంతతికి చెందిన విదేశీ పౌరులకు జన్మించిన పిల్లవాడు భారత పౌరుడు కాడు, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయ జాతీయులు కాదు.

పౌరసత్వం విభాగంలో ఓసీఐని 2005 కొత్త కేటగిరీగా చేర్చారు.ఇది విదేశీ పౌరులకు పరిమిత హక్కులు ఇవ్వలేదు.మార్చి 4 నోటిఫికేషన్ ఒక ఓసీఐని విదేశీ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న ఒక విదేశీ జాతీయుడిగానే చెప్పింది.తప్పించి అతను భారత పౌరుడు కాదని నిర్వచించింది.

మనదేశంలోని రాజకీయ, ఇతర హక్కులను పొందడానికి ఓసీఐలకు నిషేధం.కానీ వారు ఎప్పుడైనా భారతదేశాన్ని సందర్శించడానికి జీవితకాల ప్రవేశ వీసాను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

వైవాహిక స్థితితో సంబంధం లేకుండా భారత దేశం నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి తల్లిదంద్రులను అనుమతిస్తుంది.అయితే ఒంటరిగా వున్న పురుషుడు ఆడపిల్లలను దత్తత తీసుకోకూడదు.

జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం, 2015 (జెజెఎ) ప్రకారం.భారత పాస్‌పోర్ట్ కలిగి వుండి… ఏడాదికిపై విదేశాలలో నివసించిన వ్యక్తిని ఎన్ఆర్ఐగా నిర్వచించింది.

భారతీయ పిల్లలను దత్తత తీసుకోవటానికి ఎన్ఆర్‌ఐ కూడా ఒక భారతీయుడితో సమానమని (ఏఆర్) చెప్పింది.మార్చి 4 నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్ కంట్రీ అడాప్షన్ విషయంలో ఎన్‌ఆర్‌ఐ, ఓసిఐ సమానమేనని తెలిపింది.
అటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సైతం ఒంటరి వ్యక్తులు, పెళ్లికాని జంటలు భారతదేశంలో సరోగసీని అవలంభించకుండా నిషేధించింది.సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు, 2020 ప్రకారం, సరోగసీని భారతీయ దంపతులకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించబడింది.

అలాగే సరోగసీని వ్యాపారంగా నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.ఓసీఐలు మినహా అన్నిపెళ్లికాని, ఒంటరి వ్యక్తులు, విదేశీయులు సరోగసీకి అనర్హులుగా ప్రకటించింది.

ప్రత్యేకించి (ఏఆర్) కింద ఇంటర్ కంట్రీ, ఇన్ కంట్రీ అడాప్షన్‌లకు అనుమతి ఉన్నప్పుడు వివాహితులు, వివాహం కాని వారిని ఒక తరగతిగా పరిగణించలేమని తెలిపింది.అయితే మార్చి 4 నోటిఫికేషన్‌ ప్రకారం సరోగసీ విషయంలో ఎన్‌ఆర్‌ఐలతో ఓసిఐలకు సమాన ప్రాతిపదిక లేదని వెల్లడించింది.

సరోగసీ విషయంలో ఈ అసమంజసమైన వర్గీకరణ రాజ్యాంగం ఇచ్చిచ ఆదేశాన్ని ఉల్లంఘిస్తోంది.వైవాహిక స్థితి, జాతీయత, సంతానోత్పత్తి హక్కుల ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపడం సరికాదని నిపుణులు అంటున్నారు.

ఒంటరి వ్యక్తులు, పెళ్లికాని జంటలు, విదేశీయులను ఎఆర్ కింద ఇంటర్ కంట్రీ అడాప్షన్‌లకు అనుమతించినప్పుడు.భారత్‌లో సరోగసీని ఉపయోగించుకోకుండా ఎందుకు నిషేధించారనే దానిపై నోటిఫికేషన్‌లలో కారణాన్ని వివరించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube