ఈ మధ్య కాలంలో కొందరు సీరియల్ నటీనటులు సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా హిందీలో “ఖలిన్ తో హోగా” అనే సీరియల్ ద్వారా నటిగా బుల్లి తెర పరిశ్రమకి పరిచయమైన సీరియల్ హీరోయిన్ ఆమ్నా షరీష్ గురించి హిందీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు చిత్రాలలో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
దీంతో ఈ ఆమ్నా షరీష్కి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరుగుతోంది.
కాగా తాజాగా ఆమ్నా షరీఫ్ బీచ్ లో బికినీ దుస్తులు ధరించి తీసుకున్న ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో ఈ అమ్మడు అందాలకి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఎప్పుడూ ధారావాహికలలో చీర కట్టుకుని సంప్రదాయ బద్దంగా కనిపించే ఆమ్నా షరీఫ్ ఒక్కసారిగా బికినీ ధరించడంతో నెటిజన్లు అవాక్కయ్యారు.
మరికొందరైతే ఏకంగా ఆమ్నా షరీఫ్ బీచ్ లో సెగలు రేపుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ఈ మధ్య కాలంలో ఆమ్నా షరీఫ్ సినిమా అవకాశాల కోసం పొట్టి దుస్తులు ధరించడంతో పాటు స్కిన్ షో చేయడానికి కూడా సిద్ధ పడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ అమ్మడు బికినీ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా లక్షకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 14 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆమ్నా షరీష్ హిందీలో రూహీ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు హార్దిక్ మెహతా దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రం కామెడీ మరియు థ్రిల్లర్ జోనర్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం ఆమ్నా షరీఫ్ “కాసతీ జిందగీ కాయ్” అనే ధారావాహికలో కూడా నటిస్తోంది.