ఆ ఫోటోపై సమంతను ట్రోల్ చేసిన నెటిజన్లు.. చివరకు..?

గతేడాది జాను సినిమాలో హీరోయిన్ గా నటించి నటిగా ప్రశంసలు అందుకున్న సమంత ఈ ఏడాది శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు.తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Samantha Deleted Her Instagram Post In Social Media, Samantha , Instagram, Preet-TeluguStop.com

మరోవైపు సోషల్ మీడియాలో కూడా సమంత యాక్టివ్ గా ఉంటున్నారు.తాజాగా సమంత ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్ అనే వ్యక్తి ఒడిలో కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సమంత షేర్ చేసిన ఈ ఫోటోను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫోటోను యాడ్ చేసి ఐ లవ్యూ అంటూ రాసుకొచ్చారు.

సమంత తన స్టైలిష్ట్ తో క్లోజ్ అయినప్పటికీ అలా ఆ వ్యక్తిపై కాళ్లు పెట్టి ఫోటో దిగడం అభిమానులకు కూడా నచ్చలేదు.కొందరు నెటిజన్లు ఆ వ్యక్తితో మరీ అంత చనువా.? అంటూ దారుణంగా కామెంట్లు చేయడం సమంత దృష్టికి వచ్చింది.

Telugu Friendship, Netizens, Netizens Trolls, Samantha, Samantha Story-Movie

అభిమానులే విమర్శలు చేయడంతో సామ్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు.కొందరు అభిమానులు మాత్రం సమంత ఆమె ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయబోయి స్టోరీస్ లో యాడ్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా స్టైలిష్ట్ తో నాలుగు సంవత్సరాల స్నేహానికి గుర్తుగా సామ్ షేర్ చేసిన ఫోటో ఆమెపై విమర్శలకు కారణమైంది.

ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం అవాక్కవడం గమనార్హం.

మరోవైపు సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ఫిబ్రవరి నెలలో ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదల కానుండగా ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube