బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచిన సంగతి తెలిసిందే.మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ను చాలా తెలివిగా ఆడటంతో సీజన్ 4 విన్నర్ అయ్యారు.
అయితే బిగ్ బాస్ ప్రేక్షకులు అభిజిత్ అయినా బిగ్ బాస్ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా.? లేదా.? అని చర్చించుకుంటున్నారు.నాలుగేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సీజన్ 1 ప్రారంభమైంది.
కేవలం పది వారాల పాటు ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 1కు శివబాలాజీ విన్నర్ గా నిలిచారు.అయితే బిగ్ బాస్ షో ద్వారా శివబాలాజీకి బాగానే గుర్తింపు వచ్చినా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కెరీర్ పుంజుకోలేదు.
అయితే అదే సీజన్ లో పాల్గొన్న హరితేజ మరి కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2కు కౌశల్ మండా విజేతగా నిలవగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా కొన్ని నెలల పాటు షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరై కౌశల్ వార్తల్లో నిలిచారు.

అయితే ఆ తరువాత కౌశల్ సైతం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు సైతం బిగ్ బాస్ విన్నర్ అనే గుర్తింపు కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.బిగ్ బాస్ విన్నర్ అనే గుర్తింపు వల్ల గత సీజన్ల విన్నర్లకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని సీజన్ 4 విన్నర్ అభిజిత్ కైనా బిగ్ బాస్ విన్నర్ అనే గుర్తింపు ఉపయోగపడుతుందో లేదో చూడాల్సి ఉందని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అభిజిత్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఇప్పటికే అభిజిత్ కొత్త కథలను వింటున్నారని అతి త్వరలో ఆ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించినా ఇప్పటికీ అభిజిత్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
మరి బిగ్ బాస్ గుర్తింపుతో అయినా అభిజిత్ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాల్సి ఉంది.