కబళిస్తున్న కరోనా...అమెరికాలో అర నిమిషానికి ఒకరు బలి...!!

అగ్ర రాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి రోజు రోజుకి కబళిస్తోంది.అమెరికన్స్ సుదీర్ఘంగా కరోనా తో పోరాటం చేస్తూనే ఉన్నారు.

 Corona Deaths Increased In America, Us, Covid-19 Deaths, America, Corona Virus,-TeluguStop.com

ఒక పక్క కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలలో ఉన్న అపోహలు కారణంగా ఎవరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడంలేదు.ఈ క్రమంలోనే రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది.

గడించిన వారం రోజులలో కరోనా తో మరణించిన వారి సంఖ్య 18 వేలుగా నమోదు అయ్యింది.అంటే అర నిమిషానికి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందుతున్నారు.

ఈ లెక్కలో కరోనా ప్రభావం అమెరికాలో ఏ స్థాయిలో ఉన్నదొ అర్ధమవుతోంది.ముఖ్యంగా

కాలిఫోర్నియా , టెన్నిసీ, రోడ్ ఐల్యాండ్ లలో ఈ మరణాల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతోందని తెలుస్తోంది.

అమెరికా వ్యాప్తంగా ఉన్న 50 రాష్ట్రాలలో సుమారు 31 రాష్ట్రాలలో కరోనా ప్రభావం 10 శాతం ఉందని,లోవా, ఇదొహాలో దాదాపు 40 శాతం మేరకు కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.ఇదిలాఉంటే పెరుగుతున్న కేసుల కారణంగా దాదాపు అన్ని దావఖానాలు ప్రజలతో నిండిపోతున్నాయి.ఇదిలాఉంటే

Telugu America, Corona America, Corona Vaccine, Corona, Covid-Telugu NRI

అమెరికాలో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు.ఈ సెలవు దినాలలో బయటికి వచ్చే సాహసం చేయవద్దని అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ మొదలైన తరుణంలో కొంత కాలం అందరూ జాగ్రత్తగా ఉంటే తప్పకుండా కరోనా మహమ్మారి నుంచి బయటపడగలమని సూచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 1.80 కోట్ల మంది భాదితులు నమోదు కాగా, 3.30 లక్షల మంది మృతి చెందారు.అయితే వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube