జగన్ ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు.ఏ విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గకూడదు అనే అభిప్రాయంతోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.2019 ఎన్నికల్లో తనను నమ్మి ఓట్లు వేసిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.ఈ విషయంలో తన పార్టీ ప్రజాప్రతినిధులంతా ఈ విధానాన్నే పాటించాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు నాయకులకు తగిన ఆదేశాలు ఇస్తూ వస్తున్నాడు.
ఈ విషయంలో పార్టీ నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా జగన్ పట్టించుకోవడంలేదు.
ఇక విషయానికి వస్తే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతగా కష్టపడుతూ కరోనా సమయంలోనూ అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ నిరంతరం వారి కోసమే శ్రమ పడుతున్నా, ఆశించినంత స్థాయిలో మైలేజ్ రావడంలేదు అనేది జగన్ అభిప్రాయం.
ముఖ్యంగా మంత్రుల పని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడం, ప్రజల్లో వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో జగన్ ఓ రహస్య సర్వే చేయించినట్టు తెలుస్తోంది.ఈ సర్వేలో మంత్రుల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్టు, అనేక అవినీతి వ్యవహారాల్లో మునిగితేలుతున్నట్టు, మరికొంతమంది తమ శాఖలపై ఇప్పటికీ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోవడం, జిల్లాలోని ఎమ్మెల్యేలతోనూ సఖ్యత లేకపోవడం వంటి విషయాలపై చాలా మంది మంత్రుల పై నెగిటివ్ గా రిపోర్ట్స్ వచ్చాయట.
‘పీకే కన్సల్టెంటింగ్ వలంటీర్ సిస్టం’ అనే సర్వే ద్వారా జగన్ ఈ సమాచారం తెలుసుకున్నాడట.అసలే ఏరి కోరి మరీ జగన్ మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నారు.
తనకు అత్యంత సన్నిహితులైన వారిని సైతం ఈ విషయంలో పక్కనపెట్టారు.ఇప్పుడు మంత్రుల పనితీరుపై ఈ విధంగా రిజల్ట్ రావడంపై జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట.
మంత్రి మండలి ఏర్పాటు చేసే సమయంలోనే పనితీరు బాగాలేని వారిని తప్పించేస్తానని, ప్రస్తుత మంత్రుల్లో మూడొంతుల మందిని రెండున్నర సంవత్సరాల తరువాత తప్పిస్తాను అంటూ జగన్ ప్రకటించారు.
కానీ ఇప్పటికే ఈ విధంగా మంత్రులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, నెగిటివ్ గా రిజల్ట్ రావడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందట.
ముఖ్యంగా అవినీతి విషయంలో ఎవరినీ కట్టడి చేయలేకపోతున్నామని, ఎన్ని సార్లు చెప్పినా, ఎవరూ పనితీరు మార్చుకోకుండా వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నారనే అభిప్రాయంలో జగన్ ఉన్నారట.ప్రస్తుత సర్వేలో నెగిటివ్ మార్కులు సంపాదించుకున్న మంత్రులకు జగన్ మార్క్ ట్రీట్మెంట్ తో కూడిన వార్నింగ్ లు ఇచ్చేందుకు జగన్ సిద్దమవుతున్నారట.