అక్కడ ఆఫీస్ లో పనిచేసే ఆడ వారికి 12 రోజుల పీరియడ్స్ సెలవలు…!

సహజసిద్ధంగా, ప్రకృతి ధర్మంగా వయసు వచ్చినప్పటి నుండి మహిళలు రుతుక్రమంను ప్రతి నెల అనుభవించాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ విషయంలో మహిళల కష్టాలు ఎవరూ కూడా అర్థం చేసుకోవట్లేదని అనేక మహిళా సంఘాలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Ladies, Periods, Womens, Holidays, Leave, India-TeluguStop.com

ముఖ్యంగా ఈ సమస్య ఆఫీస్ లకి వెళ్లి పని చేసే వారిలో ఇబ్బంది పెడుతుంది.ఆ సమయంలో వారు పని చేయడానికి శరీరం సహకరించకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా ఓ కంపెనీ ఈ సమస్యను గుర్తించి ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నది.అసలు విషయంలోకి వెళితే మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరానికి చెందిన ఓ డిజిటల్ మార్కెటింగ్ కు చెందిన కంపెనీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

అదేమిటంటే వారి కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఒక సంవత్సరంలో 12 రోజులపాటు అదనంగా పీరియడ్స్ సెలవులను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.సదరు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ని 2014 సంవత్సరంలో భూతిక్ కేష్ అనే వ్యక్తి స్థాపించారు.

ఇకపోతే ఆ కంపెనీ లో మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు.వారి ఉద్యోగులు ఈ విషయంలో బాధపడకూడదన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇందుకుగాను ఏకంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రుతుక్రమాన్ని కి సంవత్సరం పొడవునా కలిపి 12 సెలవులను అధికంగా మహిళలకు వర్తింపజేశారు.అయితే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో ఇప్పటికీ కూడా ఋతుస్రావం విషయంలో నిషేధం ఉందని, వారిని ఆ సమయంలో అవమానకరంగా చూస్తుంటారని లాంటి కొన్ని విషయాలను తాము దృష్టిలో ఉంచుకొని మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube