బురదలో కూర్చుని శంఖం ఊదితే `కరోనా` రాదంటున్న బీజేపీ ఎంపీ!

క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు ఏ రూపంలో వ‌చ్చి ఎటాక్ చేస్తుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు.చైనాలో వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించింది.రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.క‌రోనా మాత్రం అదుపులోకి రాలేదు.

 Bjp Mp Sukhbir Singh Jaunapuria Claims Mud Pack Boosts Immunity Against Corona!,-TeluguStop.com

దీంతో దేశాల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించాయి.ఈ క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు ఏడు ల‌క్ష‌ల మించిపోగా.పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటేసింది.అయితే క‌రోనా వేగంగా విజృంభిస్తున్న వేళ బీజేపీ నేతలు ఇస్తున్న సలహాలు, సూచనలు అభాసుపాలవుతున్నాయి.ఇటీవ‌ల ఆవు పంచకంతో కరోనా నయమవుతుందని, అప్పడాలు తింటే కరోనా నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా కూడా తనవంతుగా ఓ సలహా ఇచ్చి నవ్వులపాల‌య్యారు.ఇంత‌కీ ఆయ‌న స‌ల‌హా ఏంటీ అంటే.బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదంటున్నారు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇలా చెప్ప‌డ‌మే కాకుండా ఆయన స్వయంగా బురదలో కూర్చుని శంఖం ఊది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ సుఖ్ బీర్ సింగ్ వ్యాఖ్య‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

కాగా, గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఖ్ బీర్ సింగ్.శ‌రీరానికి బురద పూసుకుని యోగా చేస్తే అన్ని వ్యాధులు నయమవుతాయని గ‌తంలో చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube