టాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిష్ గతకొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో తెగ హల్‌చల్ చేస్తోంది.కాగా ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇప్పట్లో పట్టాలెక్కుతుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది.కాగా ఈ క్రమంలో క్రిష్ మరో మెగా హీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
క్రిష్ తన నెక్ట్స్ మూవీని మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను తాజాగా లాంఛ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక షూటింగ్‌ను కూడా ఆగస్టు 15 నుండి ప్రారంభించి కేవలం ఒక్క షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాను అతిత్వరలో పూర్తి చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఎలాగూ పవన్ సినిమా ప్రారంభమయ్యే వరకు టైం పడుతుండటంతో ఆ టైంలోపే ఈ సినిమాను క్రిష్ పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఇక వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా బుచ్చిబాబు అనే డైరెక్టర్ తీర్చిదిద్దాడు.