Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే శరీరంలోని ఆ భాగంలో నొప్పి ఉంటుందా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా అవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి.అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.

 If Bad Cholesterol Is High, Will There Be Pain In That Part Of The Body ,  Bad C-TeluguStop.com

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల గుండెపోటు డయాబెటిస్ అధిక రక్తపోటు లాంటి మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి.

ఒకటి శరీర ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉంటుంది.కానీ రెండోది మాత్రం శరీరానికి హాని కలిగిస్తుంది.

మామూలుగా మంచి చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరంలో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అని, చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అని అంటారు.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండెపోటు,హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

దీనికోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్ యెుక్క లక్షణాలు సాధారణంగా కనిపించవు.

అయినా కూడా ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా తెలుసుకునే వీలు ఉంది.

చెడు కొలెస్ట్రాల్ లక్షణాలలో ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, కాళ్లు, తొడలు, పాదాలు, భుజాలలో నొప్పి ఎక్కువగా వస్తుంది.

అంతేకాకుండా తిమ్మిరి, కాళ్ల వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మీ శరీర భాగాలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వక హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.

ఈ సమస్యనే పెరిఫరల్ ఆర్టర్ డిసీజ్ అంటారు.

Telugu Almonds, Apples, Grapes, Tips, Heart Attack, Oranges, Waffle-Telugu Healt

మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.రోజు వ్యాయామం చేయడం, దంపుడు బియ్యం, సజ్జలు, బాదం, ఆపిల్, ద్రాక్ష, నారింజ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube