ప్రశాంత్ కిషోర్ ! రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.తన సొంత రాష్ట్రమైన బీహార్ లో పాదయాత్ర కూడా చేపట్టారు.
పాదయాత్రలో అనేక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తున్నారు.అయితే ఉన్నట్టుండి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సీఎం పదవీకాంక్షకు తాను సాయపడ్డానని ప్రశాంత్ కిషోర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.జగన్ కు అనవసరంగా సాయం చేశాను అని, అదే కాంగ్రెస్ కు తన రాజకీయ వ్యూహాలు అందించి ఉంటే.
బీజేపీ ని ఎదుర్కొనేందుకు పోరాడేది అని, పరిస్థితి కాస్త పరిస్థితి మెరుగ్గా ఉండేదని తన అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించాయి.
ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మండిపడింది.వాస్తవంగా జగన్ ప్రశాంత్ కిషోర్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు.అయితే ఉన్నట్టుండి వీరి మధ్య ఏం జరిగింది ? అసలు జగన్ కు ప్రశాంత్ కిషోర్ కు గ్యాప్ రావడానికి కారణం ఏమిటి ? ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు ఫైర్ అవుతున్నారు ? ఇలా అనేక అంశాలు చర్చనీయాంశం గా మారాయి.2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసిపి అధికారంలోకి వచ్చిందంటే అది ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల కారణంగానే అన్న విషయం అందరికీ తెలిసిందే.2019 ఎన్నికల్లో వైసీపీకి 67 స్థానాలు మాత్రమే వచ్చాయి.ప్రశాంత్ కిషోర్ కు వైసీపీని గెలిపించే బాధ్యతలను జగన్ అప్పట్లో అప్పగించడంతో ఆయన నియోజకవర్గాలు లో సర్వేలు చేయించడంతో పాటు , ఎవరిని అభ్యర్థిగా పెడితే గెలుస్తారు ? వైసిపి రాజకీయ ప్రత్యర్థుల బలహీనతలు, బలం ఏమిటి అనే విషయాలపై ఒక క్లారిటీకి వచ్చారు.
![Telugu Ap Cm Jagan, Ap, Bihar, Jagan, Strategy, Ysrcp-Political Telugu Ap Cm Jagan, Ap, Bihar, Jagan, Strategy, Ysrcp-Political](https://telugustop.com/wp-content/uploads/2022/11/ap-government-ysrcp-Bihar-politics-pk.jpg)
దానికి అనుగుణంగా తగిన వ్యూహాలను రూపొందించి అమలు చేయడం ద్వారా, 2019 ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటీతో ఏపీలో అధికారం దక్కించుకుంది.అప్పటి నుంచి జగన్ ప్రశాంత్ కిషోర్ మధ్య స్నేహం మరింతగా పెరుగుతూ వచ్చింది.కానీ ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు మాత్రం జగన్ ను టార్గెట్ చేసుకుని ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు.కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనతోనే పాదయాత్ర చేపట్టారు.
అయితే ఈ పాదయాత్ర కు ఆర్థిక సహాయం కూడా భారీగానే అందుతోంది. గతంలో తాను రాజకీయ వ్యూహాలు అందించిన పార్టీలే తనకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి అని, వైసీపీ కూడా ఉందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు జగన్ తగిన ఆర్థిక సహాయం చేయకపోవడమే కాకుండా, కేంద్ర అధికార పార్టీ బీజేపీ తో సన్నిహితంగా మెలుగుతూ ఉండడం వంటివి ప్రశాంత్ కిషోర్ కు ఆగ్రహాన్ని కలిగించాయి.అందుకే ఈ స్థాయిలో ఫైర్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
.