ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.ఇక కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి విద్యా సంస్థలు అన్నీ పూర్తిగా పడ్డాయి.
కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత విద్యాసంస్థలు పునఃప్రారంభం చేయాలని అనుకున్నప్పటికీ.రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు గత మూడు నెలల నుంచి తేరుకోలేదు.
ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకుంటాయ లేదా అనే అనుమానం కూడా ఉంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను తెరవాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య వెనకడుగు వేస్తున్నాయి.
ఇప్పటికే జూలై 31 వరకు స్కూల్స్ తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వబోమని అంటూ దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
ఈ నేపథ్యంలో హర్యానా సర్కారు మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈనెల 27వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయించిన హర్యానా సర్కారు జులై 26 వరకు వేసవి సెలవులు ప్రకటించింది.
అయితే కాలేజీలు విశ్వవిద్యాలయాల పునఃప్రారంభం విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.