టాలీవుడ్ లో అజయ్ భూపతి దర్శకత్వం వహించినటువంటి ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మతులు గెలుచుకున్న పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడం అలాగే ఈమె నటించినటువంటి పలు వరస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే ఇటీవల కాలంలో పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
ఇందులో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది.ఇందులో ఓ నెటిజన్ “మీరు గతంలో హీరోయిన్ గా నటించిన ఆర్ఎక్స్100 చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయతో డేటింగ్ చేశారా” అని ప్రశ్నించాడు.
దీంతో పాయల్ రాజ్ పుత్ “కార్తికేయ తనకు మంచి స్నేహితుడని అంతేగాక సినీ పరిశ్రమలో తనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందని అలాంటి తమ మధ్యలో ప్రేమ, డేటింగ్ వంటివి లేవని కొట్టిపారేసింది”. అంతేకాక తనకి టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉన్నట్లు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
మరి విజయ్ దేవరకొండ తనతో కలిసి నటించే అవకాశం పాయల్ పాపకి ఇస్తాడో లేదో చూడాలి.
అయితే ఈ అమ్మడు ఇటీవల కాలంలో నటించినటువంటి “డిస్కోరాజా”చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఎటువంటి అవకాశాలు తెచ్చి పెట్టలేక పోయింది.
దాంతో ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఏంజెల్ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.